Breaking News

15 రోజులు.. 15 మంది ఫ్రెండ్స్‌తో కలిసి మరదలిపై గ్యాంగ్ రేప్


‌ రాజధాని రాంఛీ నగరంలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. చాన్హో పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన మరదలిని కిడ్నాప్ చేసి ఫ్రెండ్స్‌తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను రోడ్డుపై వదిలేయడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. Also Read: గురువారం సాయంత్రం రోడ్డుపక్కన అర్ధనగ్నంగా నిస్సహాయ స్థితిలో యువతిని గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కాసేపటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ఆరా తీశారు. పోస్టుమార్టం రిపోర్టులో ఆమెపై అనేకసార్లు గ్యాంగ్ రేప్ జరిగినట్లు తేలడంతో అంతా షాకయ్యారు. కుమార్తె మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. Also Read: తమ కూతురు 15 రోజులుగా కనిపించడం లేదని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వారు చెబుతున్నారు. తమ కూతురిని మేనల్లుడే కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపేశాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కూతురిపై కన్నేసిన అతడు చాలా రోజులుగా వేధిస్తున్నాడని చెబుతున్నారు. 15 రోజుల క్రితం ఆమెకు కిడ్నాప్ చేసి బంధించి ఫ్రెండ్స్‌తో కలిసి అత్యాచారం చేశాడని ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడితో పాటు అతడి 15 మంది స్నేహితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By February 29, 2020 at 12:03PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/jharkhand-man-rapes-sister-in-law-with-15-friends-in-ranchi-victim-died/articleshow/74412427.cms

No comments