Breaking News

Tamilnadu: ఈ దొంగ మహిళల లోదుస్తులు మాత్రమే ఎత్తుకెళ్తాడు


తమిళనాడులోని కోవైలో ఓ యువకుడు వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఇంటి బయట ఆరేసిన మహిళల లోదుస్తులను ఎత్తుకెళ్తూ వాటిని దహనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తుడియలూరు మీనాక్షి గార్డెన్ ప్రాంతంలో 245 కుటుంబాలు నివసిస్తున్నాయి. అక్కడ కొద్దిరోజులుగా ఉతికి ఆరేసిన మహిళల లోదుస్తులు, చెప్పులు, కారులో పెట్టిన కాస్మోటిక్స్ కనిపించకుండా పోతున్నాయి. Also Read: వరుస ఘటనలతో ఆందోళన చెందిన స్థానికులు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు రాత్రివేళ కాళ్లకు పట్టీలు ధరించి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అతను చోరీ చేసి తీసుకెళ్లిన లోదుస్తులను అదే ప్రాంతంలోని ఓ ఇంటి వద్ద దాచడం, వాటిలో కొన్నింటిని అక్కడే నిప్పంటించి దహనం చేసినట్లు గుర్తించారు. Also Read: అతడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తెలీక స్థానికులు ఆందోళ చెందుతున్నారు. అతడి ప్రవర్తన మరింత ముదిరి మహిళలపై ఏమైనా అఘాయిత్యాలకు పాల్పడతాడా? అని భయపడుతున్నారు. ఉన్మాదిగా ప్రవర్తిస్తున్న యువకుడిని వెంటనే అరెస్టు చేయాలని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By January 23, 2020 at 09:30AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-locals-complains-to-police-for-female-underwear-thief/articleshow/73539433.cms

No comments