Breaking News

Darbar: దర్శకుడి మీద ఫైర్‌ అవుతున్న లేడీ సూపర్‌ స్టార్‌


సంక్రాంతి సీజన్‌లో రిలీజ్‌ అయిన తమిళ సినిమా దర్బార్‌. సూపర్‌ స్టార్ రజనీకాంత్ హీరోగా ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న రిలీజ్‌ అయి ఘనవిజయం సాధించింది. 150 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమాలో రజనీకాంత్ పోలీస్‌ అధికారి పాత్రలో నటించాడు. ఈ సినిమాలో రజనీకి జోడిగా లేడీ సూపర్‌ స్టార్ నటించింది. గతంలో మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన గజిని సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ సినిమాలో చేసిన క్యారెక్టర్‌పై నయనతార ఇటీవల విమర్శలు చేసింది. దర్శకుడు తన పాత్ర చెప్పినట్టుగా చిత్రీకరించలేదని, తన లుక్‌ కూడా అంత బాగాలేదని కామెంట్ చేసింది. ఈ విమర్శలపై స్పందించిన మురుగదాస్‌ తాను అన్ని పాత్రలను ఓకే దృష్టితో రూపొందిస్తానన్నాడు. Also Read: అయితే లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఇటీవల దర్బార్‌ సినిమాలో మరోసారి మురుగదాస్‌ డైరెక్షన్‌లో నటించింది నయనతార. అయితే ఈ సినిమా విషయంలో కూడా నయన్‌ హర్ట్ అయ్యిందన్న ప్రచారం జరుగుతోంది. దర్బార్‌ సినిమాలో నయన్‌ పాత్రకు ఏ మాత్రం ఇంపార్టెన్స్‌ లేకపోవటంపై ఆమె తీవ్రంగా నిరాశచెందినట్టుగా ప్రచారం జరుగుతోంది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్‌ అయ్యింది. అన్ని చోట్ల సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావటంతో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. రజనీకి ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి నటించిన ఈ సినిమాలో నివేదా థామస్‌ కీలక పాత్రలో నటించింది. Also Read:


By January 15, 2020 at 10:45AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/lady-super-star-nayanthara-angry-on-darbar-director-ar-murugadoss/articleshow/73264747.cms

No comments