తంజావూరులో హైదరాబాదీల అరెస్టు... దురుసుతనంతో చిక్కుల్లో పడిన దంపతులు

పుణ్యక్షేత్రాల సందర్శనకు రాష్ట్రానికి వెళ్లిన తెలంగాణ దంపతులు చిక్కుల్లో పడ్డారు. తమిళనాడులోని బృహదీశ్వర ఆలయంలో సిబ్బందిపై దాడికి పాల్పడిన భార్యభర్తలను పోలీసులు అరెస్టు చేశారు. బృహదీశ్వర ఆలయంలో ఫిబ్రవరి 5న కుంభాభిషేకం నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఆలయ ప్రాంగణంలోని రాజ మండపంలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేశారు. Also Read: సోమవారం హైదరాబాద్‌లోని తిరుమలగిరికి చెందిన దంపతులు సుందర్‌శర్మ(65), మంజు(64) బృహదీశ్వర ఆలయ సందర్శనకు వచ్చారు. ప్రత్యేక కార్యాలయంలోకి వెళ్లి అక్కడున్న విగ్రహాలను ఫోటోలు తీశారు. దీన్ని గమనించిన ఆలయ జీర్ణోద్ధరణ పనుల కమిటీ అధికారి నాడిముత్తు, వాచ్‌మెన్ రాజ్‌కుమార్ అక్కడ ఫొటోలు తీయకూడదని వారితో చెప్పారు. దీంతో రెచ్చిపోయిన దంపతులు ఆలయ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగి సిబ్బందిపై చేయి చేసుకున్నారు. వాచ్‌మెన్ రాజ్‌కుమార్ కంటికి గాయం కావడంతో అతడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. Also Read: ఈ ఘటనపై అందిన సమాచారంతో తంజావూరు పోలీసులు వెంటనే ఆలయానికి చేరుకుని విచారించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు వెస్ట్ పోలీసులు సుందర్‌శర్మ, మంజును అరెస్టు చేశారు. తెలియని ప్రాంతంలో దురుసుగా ప్రవర్తించిన ఆ దంపతులు ఇప్పుడు లబోదిబోమంటూ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. Also Read:
By January 15, 2020 at 08:49AM
No comments