Breaking News

‘పెళ్లి చేసుకోకపోతే యాసిడ్ పోస్తా’.. హైదరాబాద్‌లో మహిళా టెక్కీకి వేధింపులు


హైదరాబాద్‌లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. ప్రేమ పేరుతో మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను వేధిస్తున్న యువకుడు ఆమెపై దాడికి పాల్పడ్డాడు. కవిత అనే యువతి హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలోని సాయి పద్మజా లేడీజ్ హాస్టల్‌లో ఉంటూ ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. Also Read: శశాంక్ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని, తనతో కాకుండా మరెవరితోనూ మాట్లాడొద్దంటూ బెదిరిస్తున్నాడు. సోమవారం రాత్రి కవిత హాస్టల్ దగ్గరకు వెళ్లిన శశాంక్ ఆమెను తీవ్రంగా వేధించాడు. పెళ్లి చేసుకోకపోతే మొహంపై యాసిడ్ పోసేస్తానంటూ బెదిరించి వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించాడు. Also Read: శశాంక్‌ను ఇలాగే వదిలేస్తే తన జీవితాన్ని నాశనం చేస్తాడని భావించిన కవిత వెంటనే ఎస్సార్ నగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. Also Read:


By January 28, 2020 at 12:03PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-booked-for-sexual-harassment-on-woman-software-engineer-in-hyderabad/articleshow/73689218.cms

No comments