Breaking News

సమయం లైవ్ న్యూస్: నిర్భయ దోషులకు ఒకేసారి ఉరి.. అమరావతిపై కీలక నిర్ణయం!


⍟ నిర్భయ దోషులకు ఉరి: దేశ రాజధాని ఢిల్లీలో ఏడేళ్ల కిందట చోటుచేసుకున్న నిర్భయ ఘటన యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌తో నిర్భయ దోషులను కూడా తక్షణమే ఉరితీయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులను ఉరితీయడానికి తీహార్ జైలులో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ⍟ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన.. ప్రియాంక గాంధీకి ఫైన్: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక నిరసనల్లో అరెస్టయిన ఐపీఎస్‌ మాజీ అధికారి ఎస్‌ఆర్‌ దారాపురి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న ప్రియాంక గాంధీ వాహనాన్ని యూపీ పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆమె కాంగ్రెస్‌ నేత ధీరజ్‌ గుర్జార్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై ప్రయాణించి దారాపురి ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు జరిమానా విధించారు. పూర్తి వివరాలు కాసేపట్లో.. ⍟ అమరావతిపై సంచలన నిర్ణయం: ఏపీలో రాజధానిపై గందరగోళం కొనసాగుతోంది. ఓవైపు అమరావతి రైతుల ఆందోళన మరోవైపు ప్రభుత్వ ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది. విశాఖకు రాజధానిని తరలిస్తారా లేదా అన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఇదిలా ఉండగానే అమరావతిపై ఏపీ ప్రభుత్వానికి సంచలన ప్రతిపాదనలు వచ్చినట్లు తెలుస్తోంది. ⍟ భువనేశ్వరిపై పుష్ప శ్రీవాణి విమర్శలు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆయన సతీమణి నారా భువనేశ్వరిపై విరుచుకుపడ్డారు ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో అమరావతి ఉద్యమానికి విరాళంగా గాజులిప్పించారని.. రైతులకు ఇవ్వాల్సింది గాజులు కాదు.. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో చౌకగా కొట్టేసిన రైతుల భూములను తిరిగివ్వాలి అన్నారు. ⍟ నేటి నుంచి రెండో విడత పల్లె ప్రగతి: గ్రామాల అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించే ఉద్దేశంతో చేపడుతున్న రెండో విడత కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభం కానుంది. తొలి విడుతలో ఈ కార్యక్రమం నెల రోజులపాటు జరిగింది. 2019లో సెప్టెంబర్‌ 6 నుంచి నెలపాటు జరిగిన తొలి విడత పల్లె ప్రగతిలో గ్రామాల్లో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండిపోయిన మురికి కాల్వల పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు.


By January 02, 2020 at 08:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-top-trending-andhra-telangana-national-news-headlines-on-2nd-january-2020/articleshow/73063965.cms

No comments