Breaking News

నాలుగేళ్ల చిన్నారిపై పెదనాన్న అత్యాచారం.. తెలంగాణలో మరో ఘోరం


తెలంగాణలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు అడ్డే లేకుండా పోతోంది. కొత్త ఏడాది తొలిరోజే రాష్ట్రంలో ఘోర ఘటన వెలుగుచూసింది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు బాధితురాలికి పెదనాన్న వరుస కావడంతో ఈ ఘటనలో మరింత ఆందోళన కలిగించే విషయం. Also Read: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం కోనంపేటకు చెందిన నాలుగేళ్ల చిన్నారి తల్లి, అమ్మమ్మతో కలిసి మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిపోతోంది. ఆ సమయంలోనే చిన్నారికి వరసకు పెదనానయ్యే భూపాలపల్లి మండలం నాగారం గ్రామానికి చెందిన రాస కొమురయ్య(37) గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోకి చొరబడ్డాడు. కుటుంబసభ్యులు నిద్రమత్తులో ఉండగా చిన్నారిని ఎత్తుకెళ్లి సమీపంలోని పత్తిచేలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి పరారయ్యాడు. బుధవారం తెల్లవారుజామున మెలకువ వచ్చిన కుటుంబసభ్యులు చిన్నారి కనిపించకపోవంతో ఆందోళన పడ్డారు. Also Read: బుధవారం ఉదయం పత్తిచేనులో నుంచి చిన్నారి ఏడుస్తూ రావడాన్ని చూసిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. తనపై పెదనాన్న అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో చిన్నారి చెప్పింది. చిన్నారి జననాంగాల వద్ద రక్తస్రావం కావడంతో అత్యాచారం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో అతడి కోసం గాలిస్తున్నారు. Also Read:


By January 02, 2020 at 08:39AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/4-yr-old-girl-raped-by-uncle-in-telangana/articleshow/73063901.cms

No comments