Breaking News

‘సరిలేరు నీకెవ్వరు’ బాక్సాఫీస్ కలెక్షన్స్: అమెరికా బాక్సాఫీస్ దద్దరిల్లింది


‘’.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టారు సూపర్‌స్టార్ మహేష్ బాబు. ముందుగా ఊహించినట్లుగానే బొమ్మ బ్లాక్ బస్టర్ అని తొలిరోజే ప్రేక్షకులు తేల్చేశారు. చాలా కాలం తర్వాత మహేష్ పూర్తి తరహాలో కమర్షియల్ హీరోగా నటించారు. బాక్సాఫీస్ వద్ద సరిలేరు దద్దరిల్లుతుందని ముందు నుంచీ దర్శకుడు అనిల్ రావిపూడి చెప్తూనే ఉన్నారు. ఈరోజు ఆయన మాటలే నిజమయ్యాయి. సంక్రాంతి సెలవులతో జనాలతో థియేటర్లు, కాసులతో బాక్సాఫీస్ కిటకిటలాడేలా ఉందని చెప్పొచ్చు. అయితే అమెరికాలో ఈ సినిమా నిన్నే విడుదలైంది. అప్పుడే బాక్సాఫీస్ రిపోర్ట్ కూడా వచ్చేసింది. తొలిరోజే యూఎస్‌ఏ బాక్సాఫీస్ వద్ద సినిమా మిలియన్ డాలర్ల కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అమెరికాలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం దాదాపు 252 ప్రదేశాల్లో విడుదలైంది. ‘నెవ్వర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్’ అన్నట్లు.. అమెరికాలో తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 15 సినిమాల్లో ‘సరిలేరు..’ చోటు దక్కించుకుందట. ఇక ఇండియన్ బాక్సాఫీస్ విషయానికొస్తే ప్రీమియర్ షోల ద్వారా సినిమా తొలిరోజు ఎనిమిది కోట్లు రాబడుతుందని పలువురు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. READ ALSO: మొత్తానికి మహేష్.... ‘బొమ్మ దద్దరిల్లిపోద్ది.. సినిమా మీద చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా.. సినిమా మొదలైన రోజునుండి ఇప్పటిదాకా ఇదే వైబ్‌ని ఫీల్ అవుతున్నా. బ్లాక్ బస్టర్ రాబోతుందని ముందుగా తెలిసినప్పుడే ఇలా జరుగుతుంది’ అన్న మాటలు నిజం అయ్యాయి. అన్నట్లుగానే సంక్రాంతి పూట ప్రేక్షకులకు బ్లాక్ బస్టర్ బొమ్మను చూపించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం దర్శకుడు అనిల్ రావిపూడికి వరుసగా ఐదో హిట్, మహేష్‌కి వరుసగా మూడో హిట్ ఇచ్చింది. READ ALSO: ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక మందనకు తొలి భారీ హిట్ దక్కింది. ఇక పదమూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన లేడీ అమితాబ్ విజయ శాంతికి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టడానికి సరైన సినిమానే పడింది. సంగీత, హరితేజ, రాజేంద్ర ప్రసాద్ తదితరులకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా సినిమాను నిర్మించారు.


By January 11, 2020 at 12:59PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/mahesh-babu-starrer-sarileru-neekevvaru-movie-usa-premier-show-box-office-colletion/articleshow/73200631.cms

No comments