Breaking News

సమయం లైవ్ న్యూస్: ఇరాన్ కీలక నేత లక్ష్యంగా దాడి.. రాజ్యసభకు కవిత?


⍟ బాగ్దాద్‌లో రాకెట్ దాడి: ఇరాక్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై కొత్త ఏడాది రోజున ఇరాన్ మద్దతుదారులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా రాజధాని బాగ్దాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఏకంగా రాకెట్ దాడి జరిగింది. శుక్రవారం వేకువజామున జరిగిన ఈ దాడిలో ఇరాన్‌, ఇరాక్‌కు చెందిన ఉన్నతస్థాయి కమాండర్లు సహా ఎనిమిది మంది మృతిచెందారు. ⍟ కర్నూలు వైసీపీలో విభేదాలు: కర్నూలు జిల్లా వైఎస్సార్‌సీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే వర్సె కార్యకర్తలు రాజకీయ రగడ జరిగింది. నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్ జూపాడు మండలం బన్నూరులో ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. తమకు సమాచారం ఇవ్వకుండానే వచ్చారని కార్యకర్తలు ఎమ్మెల్యేను ప్రశ్నించారు ⍟ రాజ్యసభకు కవిత: గత సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ సభ్యురాలిగా పోటీ చేసి, ఓటమి పాలైన కల్వకుంట్ల కవితకు రాజ్యసభ స్థానం దక్కనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించి వచ్చే ఏప్రిల్‌లో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సీటు ఆమెకు కేటాయించే అవకాశమున్నట్లు టీఆర్ఎస్ నాయకులు విశ్వసనీయంగా తెలిపారు. ⍟ వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి వ్యాఖ్యలపై విస్మయం: గుంటూరు జిల్లా తాడికొండ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంబేద్కర్ విగ్రహానికి దండ వేసి.. విగ్రహం అంబేద్కర్‌దే కదా అంటూ ప్రశ్నించడంతో నెటిజన్లు షాక్ తింటున్నారు. ఎమ్మెల్యేకు అంబేద్కర్ ఎవరో కూడా తెలియదా అంటూ సెటైర్లు పేలుస్తున్నారు.. విమర్శలు చేస్తున్నారు. ⍟ జగన్‌కు పరిటాల శ్రీరామ్ ఛాలెంజ్: జగన్ సర్కార్‌కు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఓపెన్ ఛాలెంజ్ చేశారు. వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు అమరావతిలో తమ కుటుంబానిక ఒక్క సెంటు భూమి ఉందని నిరూపిస్తే.. ఆ భూమి మొత్తాన్ని ప్రభుత్వానికి రాసి ఇస్తామన్నారు. తన సవాల్‌ను స్వీకరించాలన్నారు. ఈ మేరకు పరిటాల శ్రీరామ్ ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు.


By January 03, 2020 at 08:43AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-top-trending-andhra-telangana-national-news-headlines-on-3rd-january-2020/articleshow/73078190.cms

No comments