Breaking News

విడాకులివ్వాంటూ భార్య, అత్తమామల వేధింపులు.. గుంటూరులో యువకుడి ఆత్మహత్య


పెళ్లయిన ఆరు నెలలకే విడాకులు ఇవ్వాలంటూ భార్య అత్తింటి వారు వేధించడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జిల్లాలో విషాదం నింపింది. గుంటూరు జిల్లా అమరావతి మండల కేంద్రానికి చెందిన పల్లపు తిరుపతిరావు (22) కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. అతనికి అదే గ్రామానికి చెందిన యువతితో 6 నెలల క్రితం వివాహమైంది. Also Read: రెండు నెలల పాటు సాఫీగానే సాగిన వీరి సంసారంలో అత్తింటి వారి అత్యాశ చిచ్చు రేపింది. నాలుగు నెలలుగా తిరుపతిరావు భార్యతో కలిసి అత్తింట్లోనే ఉంటున్నాడు. ఇటీవల అమ్మాయి తల్లిదండ్రులను వారి బంధువైన ఓ వ్యక్తి కలిశాడు. మీ అమ్మాయిని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తామని ప్రతిపాదన తెచ్చాడు. బాగా ధవనవంతులు కావడంతో తమ కూతురు సుఖపడుతుందని యువతి తల్లిదండ్రులు వారితో పెళ్లికి రహస్య ఒప్పందం చేసుకున్నారు. Also Read: అప్పటి నుంచి కూతురు నుంచి అల్లుడిని వేరు చేయాలని అత్తింటి వారు ప్రయత్నించసాగారు. దీంతో నిత్యం అల్లుడిని వేధించడం మొదలుపెట్టారు. కూతురి మనసు కూడా మార్చేయడంతో ఆమె కూడా భర్తను సూటిపోటి మాటలు అనేది. పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారుకావడంతో తిరుపతిరావు ఈ నెల 2వ తేదీన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోయాడు. శనివారం కూలిపనులకు వెళ్లిన చోట భార్య వచ్చి అతడిని కలిసింది. ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం చోటుచేసుకున్న తర్వాత ఆమె వెళ్లిపోయింది. రాత్రికి ఇంటికి వెళ్లిన తిరుపతిరావు ఎలుకల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, అత్తమామల వేధింపుల వల్లే తిరుపతిరావు ఆత్మహత్యకు పాల్పడినట్లు అతడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లియిన ఆరు నెలలకే విడాకులు ఇవ్వాలంటూ వేధించడం వల్లే అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also Read:


By January 06, 2020 at 11:15AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/guntur-man-commits-suicide-over-wife-harassment/articleshow/73117196.cms

No comments