సమయం లైవ్ న్యూస్: యుద్ధంపై ట్రంప్ వ్యాఖ్యలు.. సీఎంగా కేటీఆర్?

⍟ యుద్ధంపై ట్రంప్ వ్యాఖ్యలు: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఖుర్ద్స్ కమాండర్, అత్యంత శక్తివంతమైన నేత జనరల్ ఖాసిం సులేమానీ బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అమెరికా సేనలు జరిపిన దాడిలో హతమైన విషయం తెలిసిందే. అణు ఒప్పందం నుంచి 2018లో అమెరికా వైదొలగిన తర్వాత ఇరాన్‌తో అగ్రరాజ్యానికి సంబంధాలు మరింత క్షీణించాయి. అమెరికా రాకెట్ దాడితో మూడో ప్రపంచ యుద్దానికి దారితీస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ⍟ పాక్ చెరలోని ఏపీ జాలర్లకు విముక్తి: గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లి పొరపాటున పాక్ ప్రాదేశాని జలాల్లోకి ప్రవేశించిన ఏపీ మత్స్యకారులను పాకిస్థాన్ నిర్బంధించిన విషయం తెలిసిందే. పాక్ చెర నుంచి వీరిని విడిపించడానికి భారత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. జనవరి 6న 28 మంది మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేయనుంది. ⍟ సీఎంగా కేటీఆర్: కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఇటీవల చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. మంత్రులు కూడా ఈ విషయంపై స్పందించారు. తర్వాతి సీఎం కేటీఆర్ అని, ముఖ్యమంత్రి అయ్యేందుకు కావాల్సిన అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయని మంత్రులు ఎర్రబెల్లి, పువ్వాడ వంటి వారు వ్యాఖ్యానించారు. అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం.. వచ్చే రెండు నెలల్లోనే సీఎం కుర్చీపై కేటీఆర్‌ను కూర్చోపెట్టనున్నారని తెలుస్తోంది. ⍟ శ్రీకాకుళంలో ఘోర ప్రమాదం: శ్రీకాకుళం జిల్లాలో ఘోరో ప్రమాదం జరిగింది. మందన మండలం కొత్తపల్లి సమీపంలో.. ఓ కారు మహేంద్రతనయ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురి చనిపోగా.. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ⍟ విహారయాత్రలో విషాదం: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉడిపి సమీపంలోని కార్వార్ దగ్గర అనంతపురం జిల్లా కదిరి నుంచి వెళ్లిన బస్సు లోయలో పడింది.. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోగా.. 35మందికి గాయాలయ్యాయి. ఆరుగురు విద్యార్థులు, ఇద్దరు టీచర్లకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
By January 04, 2020 at 09:22AM
No comments