Breaking News

‘భీష్మ’ టీజర్: మీమ్స్ చేసే ఐఏఎస్, ఏసీపీ కథ


యంగ్ హీరో కథానాయకుడిగా నటిస్తున్న ‘భీష్మ’ టీజర్ వచ్చేసింది. వెటకారమైన పంచ్‌లతో మొదలైన ఈ టీజర్ ఆద్యంతం కామెడీగా సాగింది. ‘నీ పేరేంటి’ అని నితిన్‌ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంపత్ అడిగితే.. ‘భీష్మ’ అంటాడు. అప్పుడు ఆయన ‘భీష్మ కాదు భీష్మ సర్ అనాలి’ అంటాడు. ఇందుకు నితిన్ స్పందిస్తూ.. ‘అంటే నా పేరుకి సర్ యాడ్ చేస్తే బాగోదేమో’ అని వేసిన పంచ్ నవ్వులు పూయిస్తోంది. ఏం చేస్తుంటావ్ అని అడిగితే.. మీమ్స్ చేస్తుంటానని చెప్తాడు. కానీ రష్మిక దగ్గర మాత్రం ఐఏఎస్, ఏసీపీ అని తిరుగుతుంటాడు. ‘నా అదృష్టం ఆవగింజంతే ఉంటే దురదృష్టం దబ్బకాయ ఉందండి’ అంటూ నితిన్ బాధపడుతూ చెప్తున్న డైలాగ్ కామెడీగా ఉంది. వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రష్మికను కేవలం హీరోయిన్‌గా చూపించారే తప్ప ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యం లేదని టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. ఇందులో బ్రహ్మాజీ, వీకే నరేష్, వెన్నెల కిశోర్, రఘుబాబు కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యేలా ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫిబ్రవరి 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


By January 12, 2020 at 10:45AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nithiin-rashmika-mandanna-starrer-bheeshma-teaser/articleshow/73210828.cms

No comments