Breaking News

సంక్రాంతి రోజు ఉన్మాదిలా మారిన అల్లుడు.. కత్తితో అత్తింటివారిపై దాడి


సంక్రాంతి రోజు అల్లుడు ఇంటికొస్తే ఆ సందడే వేరుగా ఉంటుంది. అయితే తెలంగాణలోని జిల్లాలో మాత్రం ఓ అల్లుడు అత్తింట్లో కలకలం రేపాడు. ఇంటిల్లిపాదినీ కత్తితో గాయపరిచి భయభ్రాంతులకు గురిచేశాడు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంలో నివాసం ఉంటున్న జర్రిగల రాములు,శోభా దంపతులకు ముగ్గురు కుమార్తెలు. చిన్న కుమార్తె స్వప్నకు మెదక్ పట్టణానికి చెందిన గోపాల్‌ అనే ఆటోడ్రైవర్‌తో ఏడేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. Also Read: కొంతకాలంగా అదనపు కట్నం తీసుకురావాలంటూ గోపాల్ భార్యను వేధిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన ఆమె కూతురితో కలిసి పుట్టింటికి వెళ్లిపోయి భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. దీంతో భార్య, అత్తమామలపై కక్ష పెంచుకున్న గోపాల్ బుధవారం వారింటికి వచ్చాడు. అతడిని చూసి అనుమానంతో అందరూ లోనికి వెళ్లి తలుపులు వేసుకున్నారు. తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లిన గోపాల్ కత్తితో భార్యతో పాటు ఆమె కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డాడు. బాధితులు కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో గోపాల్ అక్కడి నుంచి పరారయ్యాడు. Also Read: స్థానికులు స్వప్న కుటుంబసభ్యులను కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీరిలో రాములు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు బాధితుల వాంగ్మూలం తీసుకుని గోపాల్‌పై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. Also Read:


By January 16, 2020 at 01:28PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-attacks-with-knife-on-wifes-family-in-kamareddy-district/articleshow/73293986.cms

No comments