పెళ్లి ఇష్టం లేక పారిపోయిన యువతి... ఎక్కడుందో తెలిసి షాకైన తల్లిదండ్రులు

తల్లిదండ్రులు తన మాటకు విలువ ఇవ్వకుండా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆందోళనకు గురైన యువతి ఇల్లు విడిచి పారిపోయిన ఘటన జిల్లాలో వెలుగుచూసింది. బయటకు వెళ్లిన కూతురు రాత్రయినా ఇంటికి రాకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు అర్ధరాత్రి వేళ పోలీసులను ఆశ్రయించారు. ఒంగోలు నగరంలోని మంగమూరురోడ్డు ప్రాంతానికి చెందిన యువతి(19)కి తల్లిదండ్రులు ఇటీవల పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. Also Read: తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని యువతి ఎంత చెప్పాని తల్లిదండ్రులు పట్టించుకోవడం లేదు. దీంతో మనస్తాపానికి గురై యువతి శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అర్ధరాత్రి వరకు కుమార్తె ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో అర్ధరాత్రి వేళ ఒంగోలు తాలుకా పోలీసులను ఆశ్రయించారు. Also Read: వెంటనే అప్రమత్తమైన పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగారు. టెక్నాలజీ సాయంతో యువతి ఓ స్నేహితురాలి వద్ద తలదాచుకున్నట్లు గుర్తించారు. దీంతో అక్కడి నుంచి ఆమెను తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆరు గంటల్లోనే తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టి అప్పగించిన పోలీసులకు బాధిత తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. Also Read:
By January 05, 2020 at 10:18AM
No comments