Breaking News

శంషాబాద్‌లో మరో దారుణం.. ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అఘాయిత్యం


హైదరాబాద్‌లో మరో కీచక ఘటన చోటుచేసుకుంది. ఓ ఎయిర్‌లైన్స్‌ సంస్థలో పనిచేస్తున్న యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన శంషాబాద్‌లోని ఆర్జీఐఏ పీఎస్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. శంషాబాద్‌కు చెందిన యువతి(20) విమానాశ్రయంలోని ఓ ఎయిర్‌లైన్స్‌ సంస్థలో పనిచేస్తోంది. రోజూ మాదిరిగానే విధులకు వెళ్లేందుకు ఆదివారం జాతీయ రహదారిపై అంబేడ్కర్‌ జంక్షన్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తోంది. Also Read: ఈ క్రమంలో ఓ క్యాబ్ డ్రైవర్ వచ్చి ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నానంటూ ఆమెను ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్లాక కారు పక్కకు ఆపి కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించాడు. డోర్ లాక్ చేసి అత్యాచారానికి యత్నించాడు. ఆమె నుంచి సెల్‌ఫోన్ లాక్కుని దుస్తులు చించేశాడు. Also Read: అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న కొందరు వాహనదారులు ఆ సన్నివేశాన్ని చూసి కారు చుట్టూ గుమిగూడారు. దీంతో కంగారుపడి ఆ కామాంధుడు యువతితో పాటు కారును అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీంతో బాధితురాలు నేరుగా ఎయిర్‌పోర్టుకు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కారు నంబర్ ఆధారంగా నిందితుడి వివరాలు ఆరా తీస్తున్నారు. Also Read:


By January 13, 2020 at 08:25AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/airlines-employee-rape-attempted-by-cab-driver-in-shamshabad/articleshow/73220730.cms

No comments