Ala Vaikunthapurramuloo Collection Day 1 అల.. ఫస్ట్ డే కలెక్షన్స్: బాక్సాఫీస్ ఊచకోత ఇలా..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి బరిలో సత్తా చాటుతున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ‘అల.. వైకుంఠపురములో’ చిత్రం ఆదివారం నాడు విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో భారీ ఎత్తున విడుదల చేశారు. ఇక తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు సాధించింది ఈ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ. 45 కోట్లు గ్రాస్ రాబట్టినట్టు మార్కెట్ అనలిస్ట్‌లు లెక్కలు కట్టారు. అధికారిక లెక్కలు రావాల్సి ఉండగా.. షేర్ రూ. 30 కోట్లు రాబట్టిందని అంచనా. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తొలి రోజు ఏపీ, తెలంగాణలలో దాదాపు రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో 5 కోట్లు, కేరళ, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో మూడున్నర కోట్లుపైగానే వసూలు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఏరియాల వారిగా.. నైజాంలో 5 కోట్లు, సీడెడ్‌లో 2.5 కోట్లు, ఉత్తరాంధ్రలో 2 కోట్లు, ఈస్ట్-వెస్ట్‌లలో కలిపి 4.5 కోట్లు, గుంటూరు 3 కోట్లు, క్రిష్ణా నెల్లూరు జిల్లాలలో దాదాపు 3 కోట్లు రాబట్టినట్టు ట్రేడ్ నిపుణుల అంచనా.
By January 13, 2020 at 08:23AM
No comments