ఒంగోలులో దారుణం.. ప్రియుడిని కొట్టి యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం!
ఏకాంతంగా ఉన్న ప్రేమజంటను బెదిరించిన కానిస్టేబుల్ యువతిపై దారుణంగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో కలకలం రేపుతోంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన నగర శివారు మంగమూరు రోడ్డులో బుధవారం చోటుచేసుకుంది. ఇప్పటికే వరుస దారుణాలతో సతమవుతున్న తాలూకా పోలీసులకు ఈ తలనొప్పిగా మారింది. దీంతో పోలీసులు ఈ వ్యవహారంపై గోప్యంగా విచారణ సాగిస్తున్నారు. Also Read: ఒంగోలుకు చెందిన యువతీయువకులు కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బుధవారం ఏకాంతంగా గడిపేందుకు ఒంగోలు శివారులోని మంగమూరు రోడ్డులోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. వారిని గమనించిన ఓ వ్యక్తి వెనుక వైపు పోలీసు అని రాసి ఉన్న బ్లాక్ పల్సర్ బైక్‌పై వారి వద్దకు వచ్చాడు. తాను పోలీసునని బెదిరించి ప్రియుడిపై చేయి చేసుకున్నాడు. అతడిని అక్కడి నుంచి తరిమికొట్టి యువతిని తన బైక్‌పై తీసుకెళ్లాడు. మరోచోటికి తీసుకెళ్లి ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. ఈలోగో ప్రియుడు తన స్నేహితులకు ఫోన్ చేయగా అరగంటలో వారందరూ అక్కడికి చేరుకున్నారు. వారంతా ఆ ప్రాంతంలో గాలించగా కాసేపటి అపస్మారక స్థితిలో పడివున్న యువతి కనిపించింది. కాసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు ఆ పోలీస్ తనపై అత్యాచారం చేసినట్లు చెప్పింది. Also Read: ఈ విషయాన్ని యువతి ప్రియుడు వెంటనే రూరల్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. కానిస్టేబుల్ పేరిట ఒక వ్యక్తి తన ప్రేయసిపై లైంగిక దాడికి పాల్పడినట్టు వారికి వివరించాడు. ఈ సమాచారంతో ఉలిక్కి పడిన పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. యువకుడు చెప్పిన వివరాల ఆధారంగా తమ స్టేషన్‌లో సిబ్బంది ఎవరున్నారనే విషయంపై ఆరా తీశారు. తమ వద్ద పల్సర్ బైక్ వాడకం, అతను చెబుతున్న ముఖ కవళికలతో ఉండే సిబ్బందితో పాటు గతంలో ఈ తరహా నేరాలకు పాల్పడిన నిందితుల చిత్రాలను అతనికి చూపించారు. అయితే వారెవరూ కాదని ఆ యువకుడు చెప్పడంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. Also Read: దీనిపై బుధవారం రాత్రి నుంచే రహస్యంగా విచారణ చేపట్టిన పోలీసులు ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఈ దురాగతానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. గతంలోనూ అతడిపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. నిందితుడి వీలైనంత త్వరగా గుర్తించి పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. Also Read: ఇటీవల సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితుడి రూపంలో వచ్చిన ట్రైనీ ఐపీఎస్ అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించడంతో తాలూకా స్టేషన్‌లో సిబ్బందికి ఉన్నతాధికారులు మెమోలు జారీ చేశారు. మరో ఘటనలో ఇదే స్టేషన్‌లో పనిచేస్తున్న ఐడీ పార్టీ కానిస్టేబుల్ ఒకరిపై వేటు పడింది. అదే శాఖలో పనిచేస్తున్న అధికారి భార్యతో ఫోన్లో మాట్లాడుతున్న కానిస్టేబుల్‌పైనా స్పీ సిద్ధార్థ్ కౌశల్ తాజాగా సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా జరిగిన ఘటనలో కానిస్టేబుల్ పాత్ర ఉన్నట్లు తెలియడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. Also Read:
By January 10, 2020 at 09:41AM
No comments