ప్రియుడి మోజులో భర్త గొంతు కోసేందుకు యత్నం.. చిత్తూరులో మహిళ కిరాతకం

జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే హత్య చేసేందుకు యత్నించింది. అదృష్టవశాత్తూ బాధితుడు ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రగాయాలు కావడంతో అతడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. Also Read: గంగాధర నెల్లూరు మండలం కాలేపల్లికి చెందిన గోపాల్‌కు భారతి అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహమైంది. కొన్నాళ్లు హాయిగా సాగిపోయిన వారి కాపురంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. భారతి అదే గ్రామానికి చెందిన దినకర్ అనే వ్యక్తితో పెట్టుకుంది. భర్త లేని సమయంలో భారతి ప్రియుడితో రాసలీలలు కొనసాగించేది. ఈ విషయం తెలుసుకున్న గోపాల్ పద్ధతి మార్చుకోవాలంటూ భార్యను హెచ్చరించాడు. Also Read: తన సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని భారతి తన ప్రియుడికి చెప్పింది. దీంతో వారిద్దరు గోపాల్‌ను హత్య చేయాలని పథకం వేశారు. ఆదివారం రాత్రి భారతి, దినకర్ కలిసి గోపాల్‌పై కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నించారు. చివరి క్షణంలో అప్రమత్తమైన బాధితుడు వారి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో శరీరంలో కొన్నిచోట్ల కత్తిగాట్లకు గురయ్యాడు. స్థానికులు అప్రమత్తమై అక్కడికి రావడంతో నిందితులు పారిపోయారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గోపాల్ భార్యను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న ఆమె ప్రియుడు దినకర్ కోసం గాలిస్తున్నారు. Also Read:
By January 06, 2020 at 09:11AM
No comments