Breaking News

ఓఆర్ఆర్‌పై పేలిన కారు టైరు... టీఆర్ఎస్ నేత మృతి


హైదరాబాద్‌ శివారులో జరిగిన రోడ్డుప్రమాదంలో నేత ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నాగోలుకు చెందిన మహేందర్‌రెడ్డి(48) ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. రాష్ట్ర సాధన అనంతరం టీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా యువజన ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆయన డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. Also Read: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ బ్యానర్లతో ఆదివారం శంషాబాద్‌ నుంచి ఇబ్రహీంపట్నం వైపునకు తన కారులో వెళుతున్నాడు. ఈ క్రమంలోనే మంఖాల్‌ తుక్కుగూడ మార్గంలోని ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కారు వెనక టైరు పగిలి బోల్తాపడింది. వెనకే వస్తున్న మరో కారు వేగంగా ఆయన కారును ఢీకొంది. తీవ్రంగా గాయపడిన మహేందర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. Also Read: మరో కారులో ఉన్న ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలు, కారు డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మహేందర్‌రెడ్డి సోదరుడు సుదర్శన్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By January 20, 2020 at 09:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/trs-leader-died-in-hyderabad-outer-rign-road-accident/articleshow/73414301.cms

No comments