Breaking News

'సరిలేరు నీకెవ్వరూ' ప్రీమియర్ షో టాక్!!


మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ అంటూ సంక్రాతి పండగ బ్లాక్ బస్టర్ కి సిద్ధమయ్యాడు. మహేష్ - అనిల్ రెడీ అయ్యారు. అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. గత సంక్రాంతికి ఎఫ్ 2 తో కొట్టిన బ్లాక్ బస్టర్ తో అనిల్ పై, మహేష్ కున్న క్రేజ్ తో మొదటినుండి సరిలేరు నీకెవవ్రుపై పై అంచనాలు అంతకంతకు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ టాక్ ఎలా ఉంది అంటే.. సరిలేరు నీకెవ్వరూ లో ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో నిండిపోవడం.. సెకండ్ హాఫ్ కూడా ఆ కామెడీ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా అనిల్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా ఉందంటున్నారు. అజయ్ కృష్ణ (మహేష్ బాబు) భారత ఆర్మీలో మేజర్. ఒక ఊహించని పరిణామం రీత్యా ఆంధ్ర ప్రదేశ్ కర్నూల్ కు రావాల్సి వస్తుంది. ఆ జర్నీలోనే సంస్కృతి (రష్మికా మందన్నా) ఫ్యామిలీ పరిచయం అవుతుంది. ఇక అక్కడనుండి కథ అంతా ప్రారంభం అవుతుంది.

ఇక సినిమాలో మహేష్ మైండ్ బ్లాకింగ్ పెర్ఫామెన్స్, మేజర్ గా, విజయశాంతి కుటుంబాన్ని కాపాడే వ్యక్తిగా మహేష్ ఎనేర్జి నటన సూపర్బ్ అంటున్నారు. అలాగే విజయశాంతి రోల్ కూడా సినిమాకి కీలకం అని, కొండారెడ్డి బురుజు ఇంటర్వెల్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్ అని, ట్రైన్ కామెడీ ఎపిసోడ్ అదిరిపోయిందని చెబుతున్నారు. అయితే కథలో కొత్తదనం లేకపోవడం, ఉహిచగలిగే కథనం, సెకండ్ హాఫ్ నిడివి, దేవిశ్రీ నేపధ్య సంగీతం లాంటివి మైనస్ లుగా చెబుతున్నారు. మహేష్  ఈ సినిమాతో సరిలేరు నీకెవ్వరూ అంటూ హిట్ కోటేసాడని మహేష్ ఫాన్స్ అంటున్నారు. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సరిలేరు థియేటర్స్ వద్ద మహేష్ ఫాన్స్ హంగామా మాములుగా లేదు..



By January 11, 2020 at 10:30PM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/49063/mahesh-babu.html

No comments