Breaking News

భర్తను మరో మహిళకు అమ్మేసి కొత్త బట్టలు కొనుక్కున ఇల్లాలు


భర్త ఎన్ని కష్టాలు పెట్టినా భార్య భరిస్తుంది కానీ.. అతడితో మరో మహిళతో పంచుకోవడానికి మాత్రం ససేమిరా అంటుంది. కొట్టినా, తిట్టినా భర్తను గౌరవిస్తూ ప్రేమిస్తూనే ఉంటుంది. ఇలాగే భర్తపై అమితమైన ప్రేమను పెంచుకున్న ఓ భార్య.. తన భర్తను పరాయి మహిళతో మంచంపై చూసి తట్టుకోలేకపోయింది. దీంతో అతడిని ఆ మహిళకే అమ్మేసింది. ఈ ఘటన దేశంలో వెలుగుచూసింది. Also Read: కెన్యా రాజధాని నైరోబీలోని ఓ ప్రాంతానికి చెందిన ఎడ్నా ముక్వానా అనే మహిళకు కొన్నాళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. ఇటీవల ఆమె భర్త సౌతాన్ అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇటీవల భార్య బయటకు వెళ్లిన సమయంలో ప్రియురాలిని ఏకంగా ఇంటికే రప్పించుకుని రాసలీలలు మొదలుపెట్టాడు. కాసేపటిలో భార్య తిరిగిరావడంతో అతగాడి బండారం బయటపడింది. తన భర్తను మంచంపై మరో స్త్రీతో చూసిన ఆమె గుండెలు బద్దలయ్యాయి. దీంతో ఆమె కఠిన నిర్ణయం తీసుకుంది. తన భర్తను అతడి ప్రియురాలికే అమ్మేస్తానని చెప్పింది. ఆమె నుంచి రూ.1,132 తీసుకుని భర్తను అప్పగించేసింది. Also Read: ఈ ఘటనతో షాకైన భర్త తాను వెళ్లనని, ఏదో సరదాకి ఆమెతో గడిపానని, తనకు భార్యబిడ్డలే కావాలని అన్నా ఆమె వినిపించుకోలేదు. మోసం చేసే భర్తతో తాను జీవించలేనంటూ అతడిని బయటకు పంపేసింది. ఆ డబ్బులతో న్యూ ఇయర్ కోసం తనతో పాటు పిల్లలకు కొత్త బట్టలు కొని సెలబ్రేట్ చేసుకుంది. భర్త తోడు లేకపోయినా పిల్లలను తానే పోషించుకుంటానని ఎడ్నా చెబుతోంది. Also Read:


By January 16, 2020 at 09:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kenya-woman-sold-her-husband-for-money/articleshow/73288072.cms

No comments