Breaking News

చిత్తూరు జిల్లాలో కీచక తండ్రి.. కన్నకూతురిపైనే అత్యాచారం


సభ్య సమాజం తలదించుకునే ఘటన జిల్లాలో వెలుగుచూసింది. కన్న కూతురిని కంటికి రెప్పలా కాపాడాల్సిన వాడే కామాంధుడిగా మారాడు. అభంశుభం తెలియని బాలికపై కన్నేశాడు. తండ్రి ముసుగులో ఆ కామాంధుడు సాగిస్తున్న అరాచకాన్ని ఎవరికీ చెప్పుకోలేక చిన్నారి తన బాధను పంటి బిగువున భరిస్తూ వస్తోంది. సంక్రాంతి పండుగ నాడూ అదే తీరుగా ప్రవర్తించడంతో కుటుంబ సభ్యులు ఆరా తీయగా బాలిక అసలు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. Also Read: చిత్తూరు జిల్లా మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి కూలీ పనులు చేస్తుంటాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్యకు ఇద్దరు కొడుకులు, రెండో భార్యకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. వీరిలో ఓ బాలిక(12) హాస్టల్‌లో ఉంటూ ఆరో తరగతి చదువుతోంది. అతడి ఇద్దరు భార్యలు వేరే ప్రాంతాల్లో పనులకు వెళ్తుంటారు. బాలిక ఎప్పుడైనా వచ్చినా తల్లి ఆమెను ఇంటి వద్దే వదిలేసి పనులకు వెళ్లేది. దీన్ని అలుసుగా తీసుకున్న తండ్రి బాలికను బెదిరించి అనేకసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. Also Read: ఈ విషయం ఎవరికైనా చెబితే అందరినీ చంపేస్తానని బెదిరించడంతో బాలిక మౌనంగా ఉండిపోయింది. తాజాగా సంక్రాంతి పండగ నిమిత్తం ఇంటికి వచ్చిన కూతురిపై 14వ తేదీన ఆ కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అదే సమయంలో హఠాత్తుగా గదిలోకి వచ్చిన అతడి రెండో భార్య ఆ తతంగాన్ని చూసి షాకైంది. కూతురితో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తిరుపతి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. Also Read:


By January 17, 2020 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/minor-girl-raped-by-father-in-chittoor-district/articleshow/73317062.cms

No comments