కేరళ భవనాల కూల్చివేత.. జగన్‌కు ప్లస్, బాబుకు ఇబ్బంది?
కేరళ: కొచ్చిలోని మరాడు ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన భవనాలను ప్రభుత్వం కూల్చివేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శనివారం రెండు భారీ భవనాలను కూల్చివేయగా.. ఆదివారం మరో రెండు అక్రమ భవనాలను కూల్చివేశారు. శనివారం కూల్చివేసిన 19 అంతస్థుల హోలీ ఫెయిత్ కాంప్లెక్స్‌లో 90 ఫ్లాట్స్ ఉండగా.. ఆల్ఫా సెరెన్ కాంప్లెక్స్‌లో 73 ఫ్లాట్స్ ఉన్నాయి. బ్యాక్ వాటర్స్‌కు సమీపంలోనే నిబంధనలకు విరుద్ధంగా వీటిని నిర్మించారు. భారీ పేలుడు పదార్థాలను ఉపయోగించి.. సమీపంలో ఉన్న భవనాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా క్షణాల వ్యవధిలోనే వీటిని కూల్చేశారు. నిబంధలను ఉల్లంఘించి నిర్మించిన నాలుగు భారీ భవనాలను కేరళ సర్కారు కూల్చేయడం భారతదేశంలో చేపట్టిన అతిపెద్ద కూల్చివేతల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ భవనాల కూల్చివేత విషయమై ఏపీలో టీడీపీ, వైఎస్సార్సీపీ ఫాలోవర్ల మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. రివర్ బెడ్‌లో నిర్మించిన కట్టడాలను జగన్ సర్కారు కూల్చివేయాలని వైఎస్సార్సీపీ సానుభూతి పరులు కోరుతున్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్‌ను కూల్చివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజావేదిక కూల్చివేతను తప్పుబట్టారు కదా..? ఇప్పుడు మీరేం చెబుతారని వారు టీడీపీ ఫాలోవర్లను నిలదీస్తున్నారు. దీనికి తెలుగుదేశం అభిమానులు కూడా గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. జగన్ ప్రజావేదికను కూల్చినట్టుగా కేరళ సర్కారు రాత్రికి రాత్రే ఈ భవనాలను కూల్చివేయలేదు. ఇందుకు 13 సంవత్సరాల సమయం పట్టిందని సమాధానం ఇస్తున్నారు.
By January 12, 2020 at 12:00PM
No comments