Breaking News

ప్రాణం తీసిన మత్తు.. మద్యం అనుకుని పురుగులమందు తాగేసి


మద్యం మత్తులో పురుగులమందు తాగేసిన వ్యక్తి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన ఘటన జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం వెన్నంపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన చెందిన మిల్కుల గట్టయ్య (46) మద్యానికి బానిసయ్యాడు. డిసెంబర్ 29వ తేదీన కాస్త మద్యం తాగిన గట్టయ్యకు ఇంకా తాగాలనిపించింది. మద్యానికి డబ్బులు లేకపోవడంతో ఇంట్లోని సీసాల్లో కొంచెమైనా మద్యం దొరుకుతుందేమోనని వెతుకుతున్నాడు. Also Read: ఆ సమయంలో పురుగు మందు పోసి ఉన్న సీసా కనిపించడంతో అది మద్యం అనుకొని తాగేశాడు. కాసేపటికే నురగలు కక్కుకోవడంతో కుటుంబసభ్యులు అతడిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మంగళవారం ప్రాణాలు కోల్పోయాడు. Also Read: గట్టయ్య భార్య సరోజ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోషించే వ్యక్తి చనిపోవడంతో గట్టయ్య కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. తాగుడు అలవాటు మానేయాలని ఎన్నిసార్లు కోరినా గట్టయ్య పట్టించుకోలేదని, ఇప్పుడు ఆ అలవాటే తన భర్త ప్రాణం తీసిందని అతడి భార్య సరోజ ఆవేదన వ్యక్తం చేస్తోంది. Also Read:


By January 08, 2020 at 11:41AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/peddapalli-man-died-for-drinking-poison/articleshow/73150046.cms

No comments