Breaking News

ప్రియురాలిని రేప్ చేసి... బండరాయితో తలపై కొట్టి చంపేశాడు


ప్రియురాలు వేరొక వ్యక్తితో సన్నిహితంగా ఉంటోందన్న అక్కసుతో ఓ యువకుడు ఉన్మాదిలా మారిపోయాడు. ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. మృతదేహం కాళ్లుచేతులు కట్టేసి అడవిలో వదిలేసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. Also Read: ప్రాంతానికి చెందిన రాజగోపాల్‌ కుమార్తె కవిప్రియ(16) ప్లస్‌ వన్‌ చదువుతోంది. డిసెంబర్ 31వ తేదీ ఇంటి నుంచి బయటికి వెళ్లి ఆమె తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు ఎంత గాలించినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతంలో కవిప్రియ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లి హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానించారు. పోస్టుమార్టం నివేదికలో ఆమెపై అత్యాచారం కూడా జరిగినట్లు తేలడంతో అంతా షాకయ్యారు. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టగా కవిప్రియ ఇనాంమాత్తూరు ప్రాంతానికి చెందిన మదికుమార్‌(22)తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా తానే అత్యాచారం చేసి చంపేసినట్లు అంగీకరించాడు. Also Read: మదికుమార్‌తో ప్రేమలో ఉన్న కవిప్రియ ఇటీవల మరో యువకుడితో చనువుగా ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న మదికుమార్ ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె వినిపించుకోకపోవడంతో కక్ష పెంచుకున్న అతడు ప్రియురాలిని డిసెంబర్ 31వ తేదీన అటవీప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెతో గొడవపడి కవిప్రియ చేతులు కాళ్లు కట్టేసి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటపడుతుందన్న ఆందోళనతో బండరాయితో ఆమె తలపై కొట్టి చంపేశాడు. చున్నీతో కవిప్రియ ముఖాన్ని మూసివేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ హత్యకేసులో మదికుమార్‌కు స్నేహితులెవరైనా సాయం చేశారా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By January 05, 2020 at 12:03PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-man-arrested-for-girl-firend-rape-and-murder-case/articleshow/73106079.cms

No comments