Breaking News

బన్నీ ఫ్యాన్స్ హ్యాపీయేనా... ఆరోజే మాటిచ్చాడుగా..


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు పిచ్చి హ్యాపీగా ఉండి ఉంటారు. ఎందుకంటే ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బన్నీ మళ్లీ ఫాంలోకి వచ్చేశాడు. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా ఫ్లాప్ అవడంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. దాంతో తాను వేసిన స్టెప్‌లో ఏదో తప్పు ఉందని తెలుసుకున్న బన్నీ మళ్లీ ఆ మిస్టేక్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే ఓ మంచి కథను ఎంచుకోవడానికి రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. అయితే ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తర్వాత బన్నీ నుంచి మరో సినిమా ప్రకటన లేకపోయేసరికి ఫ్యాన్స్ చాలా నిరాశచెందారు. బన్నీకి ఏమైంది? ఎందుకు తదుపరి సినిమా గురించి ప్రకటించడంలేదు అని తెగ సోషల్ మీడియాలో బన్నీకి తెగ మెసేజ్‌లు చేసేశారు. దాంతో బన్నీ వారందరికీ ఓ మాట చెప్పారు. ‘‘మై డియరెస్ట్ ఫ్యాన్స్.. మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నేను మీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. నా తదుపరి సినిమా ప్రకటించేవరకు కాస్త ఓపిక పట్టండి. ఎందుకంటే నిజాయతీగా ఓ మంచి సినిమాతో మీ ముందుకు రావాలంటే కాస్త సమయం పడుతుంది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు’’ అని ట్వీట్ చేశారు. READ ALSO: ఈరోజు ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో రెండేళ్ల క్రితం అభిమానులకు ఇచ్చిన మాటను బన్నీ నిలబెట్టుకున్నారు. రెండేళ్లు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు విపరీతమైన స్పందన వస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లోనూ బన్నీ సినిమా చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్లలో బారులు తీరుతున్నారు. అమెరికాలో ‘అల వైకుంఠపురంలో’ ప్రీమియర్ షో కలెక్షన్స్ ‘సరిలేరు నీకెవ్వరు’ కలెక్షన్స్‌ను బీట్ చేసేశాయి. ఇక బన్నీ ప్రశాంతంగా తడిగుడ్డ వేసుకుని విశ్రాంతి తీసుకోవచ్చు. READ ALSO:


By January 12, 2020 at 12:24PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/stylish-star-allu-arjun-keeps-the-promise-given-to-fans-as-he-delivers-a-good-film-ala-vaikunthapurramlo/articleshow/73211670.cms

No comments