బేగంపేటలో మందుబాబుల వీరంగం.. నడిరోడ్డుపై యువతిని బైకులపై వెంబడించి
హైదరాబాద్‌లో మందుబాబులు వీరంగం సృష్టించారు. పబ్‌కు బాయ్‌ఫ్రెండ్‌తో వచ్చిన యువతిని కోరికను వేధించారు. ప్రియుడిని కొట్టి యువతిపై అఘాయిత్యానికి యత్నించారు. ఆ కామాంధుల బారి నుంచి తప్పించుకునే క్రమంలో యువతి పరుగులు పెట్టగా బైకులపై వెంబడించారు. అక్కడున్న వారు వారిని నిలదీయడంతో ఆమెను వదిలిపెట్టారు. Also Read: ఈ ఘటనపై సమాచారం అందుకున్న పంజాగుట్ట పోలీసులు హై ఫైవ్ పబ్ వద్దకు చేరుకుని నిర్వాహకులను నిలదీశారు. అర్ధరాత్రి దాటినా పబ్‌ను ఎందుకు మూయలేదంటూ చీవాట్లు పెట్టారు. దీంతో రెచ్చిపోయిన ఆ మందుబాబులు పోలీసులపైనా దాడికి యత్నించారు. దీంతో పోలీసులు మరింత ఫోర్స్ రప్పించి వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆ కామాంధుల బారిన పడిన యువతిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. నిందితులందరినీ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. Also Read:
By January 12, 2020 at 08:38AM
No comments