Breaking News

మూడోసారీ ఆడపిల్లే పుడుతుందన్న అనుమానంతో.. భార్యను చంపి ముక్కలుగా కోసి


తన భార్య మూడో కాన్పులోనూ ఆడపిల్లనే కంటుందన్న అనుమానంతో ఓ వ్యక్తి కిరాతకానికి పాల్పడ్డాడు. ఆమెను కర్కశంగా చంపేసి శరీరాన్ని ముక్కలు చేసి తగులబెట్టాడు. అత్యంత పాశవికమైన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చోటుచేసుకుంది. ఈ దారుణాన్ని ఆ కిరాతకుడి పెద్దకుమార్తె బయటపెట్టడంతో కటకటాల పాలయ్యాడు. Also Read: రాయ్‌బరేలిలోని ఓ ప్రాంతానికి చెందిన రవీంద్రకు 2011లో ఊర్మిళ(30) అనే మహిళతో వివాహం జరిగింది. ఈ వీరికి ఇద్దరు కూతుళ్లు(11, 7 సంవత్సరాల వయస్సు) ఉన్నారు. అయితే రవీంద్రకు కొడుకు పుట్టాలని ఎంతో ఆశ. తొలి రెండు కాన్పుల్లో ఆడపిల్లలే పుట్టడంతో భార్యను వేధించేవాడు. ఈ క్రమంలోనే ఆమె మరోసారి గర్భం దాల్చింది. ఈ సారి కూడా కూతురే పుడుతుందని రవీంద్ర అనుమానం పెంచుకున్నాడు. దీంతో తండ్రి, సోదరుల సాయంతో జనవరి 4వ తేదీన భార్యను అత్యంత కిరాతకంగా గొంతు నులిమి చంపేశాడు. Also Read: అనంతరం పదునైన కత్తితో ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికేసి పిండి మరలో వేసి ముద్దగా చేశాడు. కొన్ని శరీర భాగాలను ఇంటి వెనుకే పెట్రోల్ పోసి దహనం చేశాడు. పూర్తిగా కాలని భాగానుల మూటకట్టి నాలుగు కిలోమీటర్ల దూరంలో పడేశాడు. నాలుగు రోజుల పాటు ఊర్మిళ నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఆమె పుట్టింటివారు రవీంద్రను నిలదీశారు. అతడు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లిని నాన్న, తాతయ్య కలిసి చంపేసినట్లు పోలీసులకు చెప్పడంతో వారు రవీంద్రను అదుపులోకి తీసుకున్నారు. మూడో కాన్పులోనైనా కొడుకు పుడతాడో లేదో అన్న అనుమానంతోనే భార్యను చంపినట్లు నిందితుడు చెప్పడంతో అంతా షాకయ్యారు. పరారీలో ఉన్న రవీంద్ర తండ్రి, సోదరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. Also Read:


By January 16, 2020 at 12:51PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/uttar-pradesh-man-arrested-for-chopping-grinding-and-burning-wife-dead-body/articleshow/73293054.cms

No comments