Breaking News

విజయనగరంలో ప్రేమోన్మాది.. యువతి గొంతుకోసి రైలుకింద పడి ఆత్మహత్య


విజయనగరంలో ప్రేమోన్మాద దాడి కలకలం రేపింది. ఆరు నెలలుగా వెంటపడుతున్నా ప్రేమను అంగీకరించడం లేదన్న కక్షతో ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. యువతిని గొంతు కోసి చంపేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన యువతి చనిపోయిందనుకుని తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జిల్లా వేపాడ మండలం బొద్దాం గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది. Also Read: ఎస్‌.కోట మండలంలోని చింతాడ గ్రామానికి చెందిన యువతి ఇంటర్మీడియట్ పూర్తిచేసి వేపాడ మండలంలోని బొద్దాం గ్రామంలో గల మేనమామ ఇంట్లో ఉంటోంది. అదే గ్రామానికి చెందిన కోటేశ్వరరావు(21) ఆరు నెలలుగా ఆమెను ప్రేమపేరుతో వేధిస్తున్నాడు. ఎన్నిసార్లు ప్రాధేయపడినా ఆమె తన ప్రేమను అంగీకరించకపోవడంతో చంపేయాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఆమె మేనమామ ఇంటిపై కాపుకాశాడు. భోజనం చేసిన తర్వాత మేనమామ, అతడి భార్య బయటకు వెళ్లగా యువతి ఒంటరిగా ఉంది. దీన్ని గమనించిన కోటేశ్వరరావు ఇంట్లోకి చొరబడి కత్తితో ఆమె గొంతు కోశాడు. Also Read: మరోసారి కత్తితో పొడిచేందుకు ఆమె చేయి అడ్డం పెట్టగా ఎడమచేతికి గాయమైంది. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో చనిపోయిందనుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనను కళ్లారా చూసిన యువతి మేనమామ కొడుకు కుటుంబసభ్యులను అప్రమత్తం చేశాడు. దీంతో వారంతా బాధితురాలిని ఎస్.కోట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు చెప్పారు. మరోవైపు సాయంత్రం 6.30 గంటల సమయంలో పుణ్యగిరి రైల్వేగేటు సమీపంలో గుర్తు తెలియని మృతదేహం ఉందన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ మృతదేహం కోటేశ్వరరావుదేనని నిర్ధారించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతడు కిరండోల్‌ నుంచి కొత్తవలస వైపు వెళ్తున్న డౌన్‌ ట్రైన్‌ కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. Also Read:


By January 21, 2020 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/young-man-stabs-woman-over-she-refused-love-proposal-in-vizianagaram/articleshow/73467211.cms

No comments