నిర్భయ దోషులను జనవరి 22న ఉరి తీయలేం.. హైకోర్టులో ఢిల్లీ సర్కారు

నిర్భయ దోషుల మరణ శిక్ష అమలు విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. వాస్తవానికి వీరిని జనవరి 22న ఉదయం 7 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. కానీ దోషుల్లో ఒకరైన ముకేశ్.. క్షమాభిక్ష కోసం రాష్ట్రపతిని ఆశ్రయించాడు. దీంతో డెత్ వారెంట్ జారీ చేసిన ప్రకారం జనవరి 22న వారిని ఉరి తీయడం కుదరదని ఢిల్లీ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. జైళ్ల నిబంధనల ప్రకారం కోసం వేచి చూడాల్సి ఉంటుందని న్యాయస్థానానికి తెలిపింది. ట్రయల్ కోర్టు జారీ చేసిన డెత్ వారెంట్‌పై స్టే విధించే విషయమై నేడు (బుధవారం) ఢిల్లీ హైకోర్టు వాదనలు వింటోంది. కాగా ముకేశ్ సింగ్ క్షమాభిక్ష పిటీషన్‌ను తిరస్కరించాలని నిర్భయ తల్లి ఆశాదేవి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కోరారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, రాష్ట్రపతి వద్ద ముకేశ్ మెర్సీ పిటీషన్ పెండింగ్‌లో ఉంది. క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన పక్షంలో.. కనీసం 14 రోజుల తర్వాత దోషులను ఉరి తీయాల్సి ఉంటుంది. జనవరి 22న ఢిల్లీ న్యాయస్థానం డెత్ వారెంట్ జారీ చేయగా.. నిర్భయ దోషులు వినయ్ శర్మ, ముకేశ్ సింగ్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
By January 15, 2020 at 02:15PM
No comments