పెళ్లి పేరుతో లొంగదీసుకుని.. 17ఏళ్ల బాలికను తల్లిని చేసిన యువకుడు

అభం శుభం తెలియని బాలిక అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్న ఓ కామాంధుడు ప్రేమిస్తున్నానంటూ వెంటపడి చివరకు ఆమెను తల్లిని చేసిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో వెలుగుచూసింది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(17) సంవత్సరం క్రితం ఆంధప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలంలోని ఓ గ్రామంలో ఉండే బంధువుల ఇంటికి వెళ్లింది. Also Read: అమెపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన సునీల్ అనే యువకుడు తరుచూ మాటలు కలుపుతూ ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడంతో బాలిక అతడితో తరుచూ బయటకు వెళ్తుండేంది. దీన్ని ఆసరాగా తీసుకుని పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే ఆమె గర్భం దాల్చిన విషయం కుటుంబసభ్యులకు తెలిసిపోయింది. దీంతో వారు సునీల్‌ను నిలదీయగా.. పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. Also Read: ఈలోగానే బాలికకు ఆరు నెలలు నిండటంతో డాక్టర్లు అబార్షన్ చేయించేందుకు నిరాకరించారు. అప్పటి నుంచి న్యాయం కోసం పోరాడుతున్న బాధితురాలు శుక్రవారం అశ్వారావుపేట ప్రభుత్వాసుపత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులు సునీల్‌కు చెప్పినా అతడు స్పందించలేదు. దీంతో బాధితురాలి కుటుంబం శనివారం అశ్వారావుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సునీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:
By January 19, 2020 at 02:44PM
No comments