13ఏళ్ల బాలికపై పది రోజులుగా అత్యాచారం.. హైదరాబాద్‌లో మరో దారుణం

హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 13ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు పది రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. పరిధిలోని ఎమ్‌ఎస్ మక్తాలో ప్రాంతంలో నివసించే దంపతులకు 13ఏళ్ల కూతురు ఉంది. తండ్రి వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా, తల్లి ఇళ్లల్లో పనులు చేస్తూ భర్తకు చేదోదువాడోడుగా ఉంటోంది. Also Read: దీంతో బాలిక ఎక్కువ సమయం ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. వీరి ఇంటికి సమీపంలోనే నివసించే జహంగీర్(30) అనే వ్యక్తి పంక్చర్ షాపు నడుపుతున్నాడు. బాలికపై కన్నేసిన ఆ కామాంధుడు ఆమె మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. సాయంత్రం వేళ ఆమె తల్లిదండ్రులు లేని సమయం చూసి ఇంట్లోకి వెళ్లి లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. సుమారు పది రోజులుగా ఈ కీచకపర్వం కొనసాగుతోంది. Also Read: మంగళవారం సాయంత్రం తల్లిదండ్రులు ఇంటికొచ్చేసరికి బాలిక నీరసంగా పడుకుని ఉంది. ఏం జరిగిందని తల్లి అడగ్గా ఏడుస్తూ అసలు విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి జహంగీర్‌పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. Also Read:
By January 29, 2020 at 09:40AM
No comments