Breaking News

రూ.10లక్షల కట్నం అడిగిన ప్రియుడు.. మనస్తాపంతో తీవ్ర నిర్ణయం


ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడో వ్యక్తి. ఆమెతో అనేకసార్లు హద్దులు కూడా దాటేశాడు. తీరా పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా రూ.10లక్షల కట్నం డిమాండ్ చేశాడు. దీంతో బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. జూబ్లీహిల్స్‌లోని ఫిలింనగర్‌కు చెందిన ఓ యువతి (22) ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తోంది. Also Read: అదే ప్రాంతానికి చెందిన లక్ష్మణ్‌ అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానంటూ వెంట పడేవాడు. చివరికి ఆమె కూడా అతడి ప్రేమను అంగీకరించడంతో రెండేళ్లుగా కలిసి తిరుగుతున్నారు. ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా లక్ష్మణ్ తప్పించుకునేవాడు. ఈ క్రమంలో యువతి ఈ నెల రెండో తేదీన ప్రియుడికి ఫోన్ చేసి పెళ్లి చేసుకోవాలని కోరింది. తనకు రూ.10లక్షల కట్నం కావాలని, లేకపోతే పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పాడు. Also Read: దీంతో మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబసభ్యులు ఆమెను సకాలంతో ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం కోలుకున్న యువతి శుక్రవారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు లక్ష్మణ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read:


By January 05, 2020 at 10:52AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/hyderabad-woman-try-to-suicide-over-boy-friend-resused-to-marriage/articleshow/73105596.cms

No comments