Breaking News

కాపురానికి రావడం లేదని భార్యను కిడ్నాప్ చేసి ఫ్రెండ్స్‌తో కలిసి గ్యాంగ్ రేప్


పెళ్లయి సంవత్సరాలు గడుస్తున్నా భార్యను కాపురానికి పంపడం లేదన్న అక్కసుతో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. మైనర్ అయిన తన భార్యపై ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. రాజస్థాన్‌లోని బుండీ జిల్లాకు చెందిన 20ఏళ్ల యువకుడిని ఓ బాలిక(15)తో కొన్నాళ్ల క్రితమే పెళ్లయింది. అయితే అమ్మాయికి మైనారిటీ తీరకపోవడంతో ఏదైనా సమస్య వస్తుందన్న కారణంగా తల్లిదండ్రులు ఆమెను కాపురానికి పంపలేదు. దీంతో బాలిక పుట్టింట్లోనే ఉంటూ చదువుకుంటోంది. Also Read: తన భార్యను కాపురానికి పంపాలంటూ యువకుడు కొద్ది నెలలుగా అత్తమామలను కోరుతున్నాడు. మైనారిటీ తీరేవరకు పంపేది లేదని, ఓపిక పట్టాలని వారు అల్లుడికి సూచించారు. దీంతో వారిపై కోపం పెంచుకున్న యువకుడు రెండ్రోజుల క్రితం స్కూల్‌ నుంచి ఇంటికి వెళ్లున్న తన భార్యను ముగ్గురు స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడు. ఓ వ్యానులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఓ గదిలో ఆమెను బంధించి స్నేహితులతోనూ అత్యాచారం చేయించాడు. Also Read: ఈ లోగా తన కూతురు కనిపించడం లేదని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని తీవ్రంగా గాలించి బాధితురాలిని రక్షించారు. ప్రధాన నిందితుడితో పాటు అతడి స్నేహితులు పరారీలో ఉన్నారని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. Also Read:


By December 01, 2019 at 01:24PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/rajasthan-married-minor-girl-kidnapped-raped-by-4-including-her-husband/articleshow/72316744.cms

No comments