అనుమానపు మొగుడు.. అఫైర్ పెట్టుకోకుండా భార్య యోనికి తాళం వేశాడు

అతడో ఉన్నత విద్యావంతుడు. అర్ధం చేసుకునే భార్యతో చక్కగా సాగిపోతున్న సంసారం. అయితే అనుమానపు చిచ్చు ఆ కాపురంలో చిచ్చు రేపింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటుందన్న అనుమానంతో భర్త ఆమె యోనికి తాళం వేస్తున్నాడు. భర్తపై తనను అనుమానిస్తున్నాడన్న అవమానం తట్టుకోలేక బాధితురాలు ఆత్మహత్యకు యత్నించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. Also Read: ఇండోర్‌కు చెందిన రాజ్(పేరు మార్చాం) ఉన్నత చదువులు చదివి ఓ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. తాను ఆఫీసుకి వెళ్లిన సమయంలో భార్య వేరొకరితో రాసలీలు సాగిస్తుందేమోనని అతడిని కొంతకాలం క్రితం అనుమానం కలిగింది. రోజూ ఆఫీసుకి వెళ్లే సమయంలో భార్య యోనికి తాళం వేసి కీ తీసుకెళ్లేవాడు. తనకు అక్రమ సంబంధం పెట్టుకోవాలన్న ఆశ, ఉద్దేశం లేదని భార్య ఎంత మొత్తుకున్నా అతడిలో మార్పు రాలేదు. రోజురోజుకీ భర్త అనుమానం పెరిగిపోవడంతో ఆమె భరించలేకపోయింది. మూడు రోజుల క్రితం ఇంట్లోనే విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. Also Read: దీంతో అతడు భార్యను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీయగా బాధితురాలు అసలు విషయం చెప్పింది. దీంతో షాకైన పోలీసులు ఆమెకు ఆ నరకం నుంచి విముక్తి కల్పించారు. రాజ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భార్యపై అనుమానంతో రాజ్ చేసిన పనిపై అనేకమంది మండిపడుతున్నారు. Also Read:
By December 29, 2019 at 12:58PM
No comments