Breaking News

రెండేళ్ల బిడ్డను చంపిన తల్లి.. మూడో పెళ్లికి అడ్డుగా ఉందని..!


మూడో పెళ్లికి అడ్డుగా ఉందని రెండేళ్ల బిడ్డను చంపి పారవేసిందో కసాయి తల్లి. తమిళనాడులో వెళ్లూరురు సమీపంలోని కమ్మవాన్‌పేటలో ఈ ఘటన చోటుచేసుకుంది. కమ్మవాన్‌పేటలో మేట్టుమలై కొండపై మురుగన్‌ ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అక్కడకు పనులకు వెళ్తున్న కార్మికులకు దుర్వాసన రావడంతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. పల్లంలో రెండేళ్ల వయసున్న చిన్నారి మృతదేహం కుళ్లిన స్థితిలో కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. Also Read: పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆర్కాడు సమీపంలోని తామనరై గ్రామానికి చెందిన తంగమణి అనే వ్యక్తి చిన్నారి కనిపించడం లేదని, పాప తల్లిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు తాయనూరు గ్రామానికి చేరుకుని మంజుల (22)ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా.. విస్తుపోయే విషయాలు తెలిశాయి. కొన్ని రోజుల క్రితమే ఆమె రాజామణి అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూడో వివాహానికి కుమార్తె అడ్డుగా ఉండటంతో చేసి కొండపై పారవేసినట్లు కసాయి తల్లి వెల్లడించింది. మంజులకు మొదట మేనమామతో పెళ్లి అయింది. తర్వాత అనంతరం జిల్లాకు చెందిన పాండియన్‌ను రెండో వివాహం చేసుకుంది. వీరిద్దరికీ ఒక ఆడ శిశువు జన్మించింది. తర్వాత రెండో భర్తను వదిలిపెట్టి చిన్నారితో పాటు తాయనూరులో జీవించేది. ఆ సమయంలో ఆర్కాడు సమీపంలోని వసనూరు గ్రామానికి చెందిన రాజామణితో పరిచయం ఏర్పడి ఇద్దరూ వివాహం చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు. ఇందుకు చిన్నారి అడ్డుగా ఉందని భావించి ఈ నెల 22న చిన్నారిని ఇద్దరూ కలిసి హత్య చేశారు. తర్వాత కమ్మవాన్‌పేట కొండలో మృతదేహాన్ని పారవేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మంజుల, ఆమె మూడో భర్త రాజామణిని అరెస్టు చేశారు. Also Read:


By December 31, 2019 at 01:03PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tamilnadu-mother-kills-daughter-for-third-marriage/articleshow/73043188.cms

No comments