Breaking News

ప్రియుడి మోజులో భర్తను వదిలేసిన భార్య.. చివరకు మోసపోయి..!


పెళ్లయిన 10 రోజులకే భర్తను వదిలేసి ప్రియుడి వద్దకు వెళ్లిపోయిన వివాహిత.. చివరకు అతడు మోసం చేయడంతో ఆత్మహత్యాయత్నం చేసింది. జిల్లా మండలం కానాల గ్రామంలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కానాలకు చెందిన సుబ్బలక్ష్మమ్మ కుమార్తె శాంతమ్మ, అదే గ్రామానికి చెందిన రాజేష్‌ ప్రేమించుకున్నారు. ఈ విషయం దాచిపెట్టి శాంతమ్మను మరో వ్యక్తికి ఇచ్చి 9 సంవత్సరాల క్రితం పెళ్లి చేశారు. అయితే పెళ్లయిన 10 రోజులకే తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నట్లు శాంతమ్మ భర్తకు చెప్పింది. దీంతో అతడు ఈ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. తర్వాత శాంతమ్మ భర్తను వదిలి ప్రియుడి రాజేష్‌ వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి వాద్దరూ సహజీవనం చేస్తూ వచ్చారు. Also Read: ఈ నేపథ్యంలోనే శాంతమ్మకు రాజేష్ రెండు సార్లు అబార్షన్‌ చేయించాడు. అయితే తనను వివాహం చేసుకోవాలని పలుమార్లు కోరినా రాజేష్ దాట వేస్తూ వచ్చాడు. వారం క్రితం ఇక పెళ్లి చేసుకోవడం కుదరదని శాంతమ్మకు తేల్చిచెప్పడంతో ఏడుచుకుంటూ పుట్టింటికి చేరుకుంది. తీవ్ర మనస్తాపానికి గురై సోమవారం ఉదయం మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగింది. అపస్మారక స్థితిలో పడి ఉండగా తల్లి గుర్తించి బంధువుల సాయంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించింది. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే తన బిడ్డకు న్యాయం చేయాలని శాంతమ్మ తల్లి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. Also Read:


By December 31, 2019 at 02:37PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kurnool-woman-attempt-to-suicide-due-to-fraud-of-lover/articleshow/73044590.cms

No comments