Breaking News

ఫ్రెండ్‌తో కలిసి భార్యను రేప్ చేసి జననాంగాలపై వాతలు.. కదిరిలో దారుణం


భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో ఓ వ్యక్తికి దుర్మార్గానికి పాల్పడ్డాడు. ఆమెను చిత్రహింసలు పెట్టి స్నేహితుడితో కలిసి గ్యాంగ్ రేప్ చేశాడు. అంతటితో ఆగక ఆమె జననాంగాలపై వాతలు పెట్టి పైశాచికానందం పొందాడు. జిల్లా కదిరిలో జరిగిన దారుణ ఘటన వివరాలిలా ఉన్నాయి. Also read: తలుపుల మండలం సిద్దిగూరుపల్లికి చెందిన మహిళ(30)కు నాలుగేళ్ల క్రితం సోమేష్‌ నగర్‌కు చెందిన మల్లేశ్వర్‌తో వివాహమైంది. దంపతులిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొంతకాలంగా మల్లేశ్వర్‌ భార్యపై అనుమానం పెంచుకుని వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే నవంబర్‌ 29న మద్యం తాగి స్నేహితుడు కుమార్‌తో కలిసి ఇంటికి వచ్చిన మల్లేశ్వర్‌ భార్య కాళ్లు, చేతులను మంచానికి కట్టేసి చిత్రహింసలు పెట్టాడు. ఫ్రెండ్‌తో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఆమె జననాంగాలపై వాతలు పెట్టాడు. Also read: ఈ ఘటన అనంతరం బాధితురాలు పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే కుమార్తె పరిస్థితిని గమనించిన ఆమె తల్లి ఏం జరిగిందని ప్రశ్నించగా అసలు విషయం వెలుగుచూసింది. తీవ్ర గాయాలతో ఉన్న కుమార్తెను చికిత్స కోసం ప్రాంతీయ వైద్యశాలకు తీసుకొచ్చింది. అల్లుడిపై పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు మల్లేశ్వర్‌‌తో పాటు అతడి స్నేహితుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై గతంలోనూ అనేక కేసులు నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. Also read:


By December 04, 2019 at 08:48AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/kadiri-man-rapes-wife-with-his-friend-case-booked/articleshow/72358671.cms

No comments