ప్రకాశం జిల్లాలో తల్లీకూతుళ్ల దారుణహత్య.. రాళ్లతో కొట్టి సజీవదహనం

ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పట్టణంలో తల్లీకూతుళ్లను దుండగులు దారుణంగా చంపేశారు. బుధవారం ఉదయం ఇద్దరు మహిళలు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా తల్లీకూతుళ్లు విగతజీవులుగా పడివున్నారు. Also Read: వారిద్దరిని దుండుగులు రాళ్లతో కొట్టి దారుణంగా చంపేసినట్లు తెలుస్తోంది. అనంతరం మృతదేహాలను దహనం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇది తెలిసిన వారి పనేనా? లేక దొంగతనానికి వచ్చిన వారెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. Also Read: ఈ దారుణ ఘటనలో సంతనూతలపాడు పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్న సమయంలో ఈ ఘటన జరగడంపై స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. Also Read:
By December 04, 2019 at 09:11AM
No comments