సమయం లైవ్ న్యూస్: ఢిల్లీలో సీఏఏ ప్రకంపనలు.. పవన్ యూటర్న్

⍟ దేశవ్యాప్తంగా సీఏఏ ప్రకంపనలు: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఇంత వరకూ ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన ఆందోళనలు క్రమంగా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆదివారం చేపట్టిన ఆందోళనలతో దేశ రాజధాని అట్టుడుకింది. ఢిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు, స్థానిక ప్రజలు ఉమ్మడిగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి, ఉద్రిక్తతకు దారి తీసింది. ⍟ ఐఆర్ఎస్ అధికారిపై అవినీతి కేసు: ఏపీ ఐఆర్‌ఎస్ కృష్ణ కిషోర్‌పై కేసు నమోదైంది.. సెక్షన్ 188,403, 409, 120 బీ కింద సీఐడీ కేసు ఫైల్ చేసింది. ఇటీవలే జాస్తి కృష్ణ కిషోర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. కృష్ణ కిషోర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో.. పరిశ్రమలు, మౌలిక వసతుల శాఖ నుంచి ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. ⍟ పవన్ యూటర్న్.. సినిమాల్లోకి: జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాల్లోకి రాబోతున్నారన్న సస్పెన్స్ తెరదించుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకునే న్యూస్ చెప్పారు బడా ప్రొడ్యుసర్ దిల్ రాజు. ప్రతిరోజు పండగే మూవీ ప్రీ రిలీజ్ వేడుకను ఆదివారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన దిల్ రాజు పవన్ కళ్యాణ్ అప్ కమింగ్ మూవీపై క్లారిటీ ఇస్తూ బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. ⍟ మోసాలకు పాల్పడుతున్న నటుడు అరెస్ట్: జనాలను మోసం చేస్తున్న ఓ సినిమా హీరోని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. రుణాల పేరుతో పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలపై సినిమా హీరో బషీద్‌ను వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో కన్‌స్ట్రక్షన్ కంపెనీల్లో పెడతానని, ఉద్యోగాలిప్పిస్తానని బషీద్ మోసం చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు. ⍟ పెరిగిన పాల ధరలు: తెలంగాణలో విజయ పాలధరలు పెరిగాయ్. విజయపాల ధర పెంచాలని తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ది అభివృద్ధి సహకార సమాఖ్య (టీఎస్‌డీడీసీఎఫ్) నిర్ణయించింది. సోమవారం నుంచి లీటరుకు రూ.2 చొప్పున పాలధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సేకరిస్తోన్న పాల ధరలు పెరగడంతో.. పాల విక్రయ ధరలను కూడా పెంచాలని నిర్ణయించారు.
By December 16, 2019 at 08:42AM
No comments