సమయం లైవ్ న్యూస్: ఏపీ మంత్రి సోదరుడిపై భూ కబ్జా ఆరోపణలు

⍟ మా భూమిని కబ్జా చేశారు.. ఏపీ మంత్రి తమ్ముడిపై ఫిర్యాదు: ఏపీ మంత్రి సోదరుడిపై భూ కబ్జా ఆరోపణలు. తమ భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తున్న బాధితులు.. స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు. తమ లేఔట్‌కు అన్ని అనుమతులు ఉన్నా తమ స్థలాల చుట్టూ ప్రహరీ గోడ కట్టారని బాధితులు ఆరోపణ. ⍟ రెడ్డి, వెలమలకు బలుపు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు: కులాలను ప్రస్తావిస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. క్రిస్మస్ దుస్తుల పంపిణీ కార్యక్రమంలో నోరు జారిన ఎమ్మెల్యే. ⍟ దిశకేసు: నలుగురు నిందితుల అంత్యక్రియలు పూర్తి.. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్యకేసు నిందితుల అంత్యక్రియలు పూర్తయ్యాయి. నారాయణపేట జిల్లా మక్తల్ మండలం గుడిగండ్లలో జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులు.. జక్లేర్‌లో మహ్మద్ ఆరిఫ్ అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం రాత్రే అంతా పూర్తి చేయగా.. ఎన్‌కౌంటర్ జరిగిన 18 రోజులు తర్వాత వారి మృతదేహాలకు అంత్యక్రియలు జరిపారు.
By December 24, 2019 at 08:51AM
No comments