Breaking News

సమయం లైవ్ న్యూస్: అమరావతిలో టీడీపీ నేతల భూముల చిట్టా ఇదేనా..!


⍟అమరావతిలో టీడీపీ నేతల భూముల వివరాలు:టీడీపీ హయాంలో అమరావతి ప్రాంతంలో జరిగిన భూముల కొనుగోళ్లపై జగన్ సర్కార్ విచారణకు సిద్ధమయ్యింది. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇవ్వడంతో న్యాయ నిపుణుల సలహా తీసుకొని దర్యాప్తు బాధ్యతలు ఎవరికి అప్పగించాలన్నది తేల్చనున్నారు. సీబీఐకే ఈ కేసు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. సీఆర్డీఏ పరిధిలో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతల వివరాలు తమ దగ్గర ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ⍟ రైతులపై నాన్-బెయిలబుల్ కేసులు: ఏపీ రాజధాని తరలింపు ప్రతిపాదనలతో అమరావతి రైతులు భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఈ రోజు రాష్ట్ర క్యాబినెట్ సమావేశం నేపథ్యంలో రైతులు ఆందోళనలు తీవ్రతరం చేశారు. కొన్నిచోట్ల ఆందోళన కార్యక్రమాల్లో అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. రాజధాని రైతలు ఆందోళనలు కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై కొందరు దాడికి పాల్పడ్డారు. మరికొన్ని చోట్ల పోలీసులపై కూడా దాడులు జరిగినట్లు సమాచారం. ⍟ పన్ను చెల్లింపుదారులకు ఊరట: కేంద్ర ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు శుభవార్త అందించేందుకు సిద్ధమౌతోంది. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపుతో కంపెనీలకు ఇప్పటికే తీపికబురు అందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పుడు ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే నిర్ణయాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ⍟ 16 మందిని హత్యచేసిన కిల్లర్: మహిళల ఒంటిపై నగలు, వారి వద్ద ఉన్న డబ్బు కోసం ఏకంగా 16 మందిని హత్యచేసిన నరహంతకుడు, తన సొంత తమ్ముడ్ని కూడా వదలిపెట్టలేదు. కల్లు, మద్యం తాగే మహిళలనే లక్ష్యంగా చేసుకుని ఘాతుకాలకు పాల్పడిన నరరూప రాక్షసుడిని మహబూబ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలోనే అనేక సార్లు జైలుకు వెళ్లినా అతడి ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు.


By December 28, 2019 at 08:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-top-trending-andhra-telangana-national-news-headlines-on-28th-december-2019/articleshow/73003057.cms

No comments