సమయం లైవ్ న్యూస్.. ఎట్టకేలకు విక్రమ్ ఆచూకీ లభ్యం.. పవన్‌పై మంత్రి ఘాటు వ్యాఖ్యలు

- విక్రమ్ జాడ కోసం గత రెండు నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. చంద్రుడి ఉపరితలానికి అతి సమీపంలోకి వెళ్లి కూలిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీని నాసా కనుగొంది. నాసాకు చెందిన లూనార్ రీకనైసాన్స్ ఆర్బిటర్ (ఎల్‌ఆర్‌వో) విక్రమ్ శకలాల వల్ల చంద్రుడి ఉపరితలంపై ప్రభావితమైన ప్రదేశాలను స్పష్టంగా గుర్తించింది.
- విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న కడప జిల్లా పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణానాయక్‌పై వేటు పడింది. ఆయన్ని సస్పెండ్ చేస్తూ ఆర్జేడీ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
- జనసేన వర్సెస్ వైఎస్సార్‌సీపీ.. ఏపీలో మళ్లీ పొలిటికల్ హీట్ పెరిగింది. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో పర్యటిస్తున్న పవన్.. సీఎం టార్గెట్‌గా విమర్శనాస్త్రాలు సంధించారు.. అంశాలవారీగా జగన్‌పై విరుచుకుపడుతున్నారు. ఇటు పవన్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి కౌంటర్లు పడుతున్నాయి. పవన్ చంద్రబాబుతో కలిసి జగన్‌ను టార్గెట్ చేస్తున్నారని.. ప్యాకేజీ తీసుకొని టీడీపీకి పనిచేస్తున్నారంటూ మండిపడుతోంది. పవన్ టార్గెట్‌గా ఏపీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
- సూర్యాపేట జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. చివ్వెంల మండలం గుంపుల దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో కారులోని నలుగురు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
By December 03, 2019 at 08:50AM
No comments