Breaking News

మతిస్థిమితం లేని వివాహిత, మైనర్ బాలికలపై రేప్..


మతిస్థిమితం సరిగా లేని మైనర్ బాలిక, వివాహితపై కామాంధులు పైశాచికత్వం ప్రదర్శించారు. కనీస మానవత్వం మరిచి వారిపై లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఇరుగుపొరుగున ఉన్నవారే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. జిల్లా, రాష్ట్రంలో రెండు వేర్వేరు దుర్ఘటనలు చోటుచేసుకున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా యాదమరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహిత (32) నాలుగేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. అయితే శనివారం సాయంత్రం ఆమె ఇంటి వెనుక ఉన్నారు. అదే గ్రామంలో తన అత్త వారింటిలో ఉంటున్న ఓ యువకుడు (35) ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారం చేశాడు. వివాహిత భర్త ఫిర్యాదు మేరకు ఆదివారం పోలీసులు కేసు నమోదుచేశారు. అలాగే ఒడిశా రాష్ట్రం ఢెంకనాల్‌ జిల్లాలో నివాసం ఉంటున్న మతిస్థిమితం లేని పదేళ్ల బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 19న స్థానిక వీధిలో బాలిక ఆడుకుంటుండగా, అదే ప్రాంతానికి చెందిన యువకుడు చాక్లెట్లు కొనిస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రులు ఈ ఘోరాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. దీంతో ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


By December 23, 2019 at 09:01AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mentally-ill-woman-and-girl-was-raped-by-neighbours-in-chittoor-odisha/articleshow/72932245.cms

No comments