Breaking News

సమయం లైవ్ న్యూస్: జార్ఖండ్ ఫలితాల్లో కాంగ్రెస్‌ కూటమికి ఆధిక్యం


⍟ జార్ఖండ్ ఫలితాలు: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 81 స్థానాలకు ఐదు విడతల్లో పోలింగ్ నిర్వహించగా ఫలితాల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల సరళి ప్రకారం కాంగ్రెస్- జేఎంఎం కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార బీజేపీ వెనుకబడి ఉంది. కాంగ్రెస్ కూటమి 41, బీజేపీ 27, జేవీఎం 2, ఇతరుల ఏడు స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు. పూర్తి వివరాలు కాసేపట్లో.. ⍟ ఢిల్లీలో అగ్ని ప్రమాదం: దేశ రాజధానిలో ఢిల్లీలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. కిరారి ప్రాంతంలోని ఓ వస్త్ర గోదాంలో సోమవారం వేకువజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. నాలుగు అంతస్థుల భవనంలోని కింది భాగంలో ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటలు ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రమాదం జరిగింది. ⍟ విశాఖలో రోడ్డు ప్రమాదం: విశాఖ జిల్లా అనకాపల్లి సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కశింకోట మండలం గొబ్బూరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బైక్‌పై వెళ్తున్నవారిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ⍟ పించన్ల కోతకు జగన్ స్కెచ్: ఏపీలో జగన్ సర్కార్‌ పింఛన్లకు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చిందా.. కరెంట్ బిల్లు ఎక్కువొస్తే పెన్షన్ కట్ అవుతుందా.. రేషన్‌కు కొత్త నిబంధనలు తీసుకొచ్చారా.. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. ఏపీ సర్కార్ జీవో ప్రకారం పింఛన్, రేషన్ కార్డులకు కరెంట్ బిల్లులు, ఆదాయంతో లింక్ పెట్టారని విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ⍟ యువతి వెన్నులో బుల్లెట్: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ యువతి వెన్నులో బుల్లెట్ బయటపడటం కలకలం సృష్టించింది. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన అస్మా బేగం (18) అనే యువతి శరీరంలో వైద్యులు బుల్లెట్‌ను గుర్తించారు. వెన్నుపూస వెనుక భాగంలో ఉన్న కండరాల్లో బుల్లెట్ విరిగిపోయి ఉన్నట్లు గుర్తించారు. ఏడాది కాలంగా ఇది శరీరంలో ఉండిపోయినట్లు భావిస్తున్నారు. ⍟ చిరు లెటర్ వైరల్: ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు’’ అని వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలుకుతూ మెగాస్టార్ చిరంజీవి శనివారం ఒక ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అధికార, పరిపాలన వికేంద్రీకరణతో అభివృద్ధి సాధ్యమేనని చిరంజీవి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


By December 23, 2019 at 08:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/telugu-top-trending-andhra-telangana-national-news-headlines-on-23rd-december-2019/articleshow/72932098.cms

No comments