Breaking News

విజయవాడలో చిన్నారిపై అఘాయిత్యం.. కామాంధుడికి దేహశుద్ధి


విజయవాడలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. చిట్టినగర్‌ గొల్లపాలెంగట్టు జోడు బొమ్మల సెంటర్‌లో ఓ చిన్నారిపై బుధవారం రాత్రి ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. వన్‌టౌన్‌ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం బుధవారం జోడు బొమ్మల సెంటర్‌లో ఉన్న బంధువుల ఇంటికి వచ్చింది. రాత్రి తిరిగి వెళ్తున్న సమయంలో వారి మూడేళ్ల చిన్నారి తల్లిదండ్రుల వెనుక నడుచుకుంటూ వస్తుండగా జోడుబొమ్మల ప్రాంతానికి చెందిన ఉదయ్‌కిరణ్‌ అనే యువకుడు ఆమెను ఆడిస్తున్నట్లు నటిస్తూ సందులోకి తీసుకెళ్లాడు. Also Read: కాస్తదూరం వెళ్లాక వెనక్కి తిరిగి చూసిన దంపతులకు తమ కూతురు కనిపించలేదు. దీంతో వారు ఆందోళనపడి చుట్టుపక్కల వెతికారు. ఉదయ్‌కిరణ్ చిన్నారిపై లైంగిక దాడికి యత్నించడంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. దీంతో ఆ దంపతులు స్థానికుల సాయంతో అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్థానికుల సమాచారంతో కొత్తపేట పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఈ విషయం బయటకు తెలిస్తే తమ కుటుంబ పరువు పోతుందన్న ఉద్దేశంతోనే వారు ఫిర్యాదు చేయడం లేదని పోలీసులు చెబుతున్నారు. Also Read:


By December 27, 2019 at 11:14AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-arrested-in-vijayawada-over-rape-attempt-on-3-yr-old-girl/articleshow/72989825.cms

No comments