పక్కింటి యువకుడి నిర్వాకం.. ప్రేమ పేరుతో బాలికను రేప్ చేసి పరార్

ప్రేమ పేరుతో మైనర్ బాలికను లైంగికంగా దోచుకున్న యువకుడు పెళ్లి ఊసు ఎత్తేసరికి పరారైన ఘటన ప్రకాశం జిల్లా మండలంలో వెలుగుచూసింది. విశాఖపట్నానికి చెందిన ఆషిక్(22) అనే యువకుడు కొద్ది నెలల క్రితం మార్కాపురం మండంలోని రాయవరం గ్రామానికి వచ్చి ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. Also Read: అతడి పక్కింట్లో కుటుంబంలో ఓ మైనర్ బాలిక ఉంది. దీంతో ఆమెను మాయమాటలతో ముగ్గులోకి దించిన ఆషిక్ ఆమె పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీన్ని అడ్డం పెట్టుకుని తన గదిలోనే అనేకసార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ బాలిక తల్లిదండ్రుల కళ్లుగప్పి అతడితో సినిమాలు, షికార్లకు తిరిగేది. తీరా తనను పెళ్లి చేసుకోవాలని ఆ బాలిక అడిగితే అతడు నిరాకరించాడు. ఇంతకాలం ఇద్దరం కలిసి తిరిగాం, ఎంజాయ్ చేశాం.. దీనికే పెళ్లి చేసుకోవాలని అడిగితే ఎలా అంటూ ఆమెతో అన్నాడు. Also Read: దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. ఈ ఘటనపై వారు ఆదివారం మార్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఆషిక్ పరారయ్యాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. Also Read:
By December 09, 2019 at 08:43AM
No comments