Breaking News

హోటళ్లలో హైటెక్ వ్యభిచారం.. విశాఖలో ఇద్దరు బ్రోకర్లు అరెస్ట్


సాగర నగరం విశాఖపట్నంలో అసాంఘిక కార్యకలాపాలు హెచ్చుమీరుతున్నాయి. ఇటీవల కాలంలో బీచ్‌రోడ్‌లోని గెస్ట్‌హౌస్‌ల్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార దందాలను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నగరంలో సెక్స్ రాకెట్లపై పోలీసులు నిఘా పెట్టారు. నగరానికి వచ్చి హోటళ్లలో బస చేసే పర్యాటకులను టార్గెట్ చేసుకుని వ్యభిచార నిర్వాహకులు రెచ్చిపోతున్నారు. Also Read: ఇలాంటి ముఠాలపై నిఘా పెట్టిన పోలీసులు నగరంలోని ఓ హోటల్‌లో హైటెక్‌ వ్యభిచారం చేయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన వీరు ఆన్‌లైన్‌ ద్వారా విటులను ఆకర్షించి యువతులతో వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతర ప్రాంతాలకు చెందిన యువతులను నగరానికి తీసుకొచ్చి వారితో హోటళ్లలో వ్యభిచారం చేయిస్తునట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. Also Read: నగరంలోని చాలా హోటళ్లలో ఇదే మాదిరిగా వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో బీచ్‌రోడ్‌లోని గెస్ట్‌హౌస్‌ల్లో జరుగుతున్న అనేక సెక్స్ రాకెట్లను పోలీసులు చేధించారు. దీంతో వ్యభిచార నిర్వాహకులు హోటళ్లను కేంద్రంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు విశాఖ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. Also Read:


By December 09, 2019 at 08:28AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/sex-racket-busted-in-vizag-two-arrested/articleshow/72432445.cms

No comments