Breaking News

వికారాబాద్ జిల్లాలో ఉరేసుకున్న ప్రేమజంట.. చివరి నిమిషంలో తాడు తెగడంతో


తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదన్న కారణంతో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన తెలంగాణలోని జిల్లాలో జరిగింది. ఈ ఘటనలో యువకుడు చనిపోగా ఆఖరి నిమిషంలో తాడు తెగిపోవడంతో యువతి ప్రాణాలతో బయటపడింది. పూడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన పాలపల్లి మహేశ్‌ (24) పదో తరగతి చదువుతున్న ఓ బాలికతో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. Also Read: గురువారం ఉదయం పాఠశాలకు వెళ్లిన మహేశ్ తన ప్రియురాలిని మైసమ్మగడ్డతండా వెళ్లే మట్టిరోడ్డు వైపు తీసుకెళ్లాడు. పెళ్లికి పెద్దలు ఒప్పుకునేలా లేరని, అందుకే కలిసి చనిపోదామని ఆమెను ఒత్తిడి తెచ్చాడు. దీంతో ఇద్దరూ కలిసి చెట్టుకు ఉరి వేసుకున్నారు. మహేశ్‌ కొద్దిసేపటికి ప్రాణాలు కోల్పోగా.. తాడు తెగిపోవడంతో బాలిక కిందపడిపోయి అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. కొద్దిసేపటికి తేరుకున్న ఆమె భయపడి పాఠశాలకు వెళ్లి టీచర్లకు విషయం చెప్పింది. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ మొగులయ్య, ఎస్సై భీంకుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి బాలికను వికారాబాద్‌‌‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. Also Read: బాలికను ప్రేమ ముగ్గులోకి దించిన మహేశ్‌ను ఏడాది కిందటే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మందలించారు. అతడిలో ఎలాంటి మార్పు రాకపోవటంతో అప్పట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా మహేశ్‌ బాలికను మరిచిపోలేదు. ఆమెనే పెళ్లి చేసుకుంటానని భీష్మించుకుని కూర్చున్నాడు. అయితే ఆమెకు మైనారిటీ తీరకపోవడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. ఈ క్రమంలోనే మహేశ్‌ ఆమెను బయటకు తీసుకెళ్లి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. Also Read:


By December 27, 2019 at 10:55AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/telangana-lovers-attempt-suicide-in-vikarabad-man-died/articleshow/72989617.cms

No comments