జనావాసాల్లో గుట్టుగా వ్యభిచారం.. ఓ సెక్స్‌వర్కర్, ముగ్గురు విటుల అరెస్ట్

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న వ్యభిచార దందాను పోలీసులు రట్టు చేశారు. వంగాయ గూడెం సమీపంలోని గొల్లాయిగూడెం గృహకల్ప హౌసింగ్ కాలనీలో పుట్టా నీలవేణి(36) అనేమహిళ కొంతకాలం నుంచి వ్యభిచారం నిర్వహిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి తన ఇంట్లో గుట్టుగా నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఓ మహిళ(25) తీసుకొన్ని తన ఇంట్లో ఉంచింది. ఆమె ఇంటికి అనేక మంది యువకులు వస్తుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. Also Read: దీనిపై సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ బాల రాజాజీ సిబ్బందితో కలిసి శుక్రవారం రాత్రి ఓ ఇంటిపై దాడి చేశారు. ఈ సందర్భంగా విటులుగా వచ్చిన ఏలూరు శాంతినగర్‌కు చెందిన యువకుడు, తాడేపల్లిగూడెంలోని బొమ్మిడికి చెందిన యువకుడు, ఏలూరు దొంగలమండపం ప్రాంతానికి చెందిన ఆయుర్వేద వైద్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు వ్యభిచార నిర్వాహకురాలు నీలవేణిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సెక్స్‌వర్కర్‌ని అదుపులోకి తీసుకుని సంరక్షణ హోమ్‌కు తరలించారు. Also Read: Also Read:
By December 08, 2019 at 10:19AM
No comments